News April 24, 2025

చిన్నగంజాంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం గొనసపూడి- తిమ్మసముద్రం రోడ్డు మార్గంలో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కూలీలతో వెళుతున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో కడవకుదురు గ్రామానికి చెందిన మహిళా కూలీ సోమమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మరో ఆరుగురు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 25, 2025

ఖమ్మం మిర్చి నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్.!

image

ఖమ్మంలో పండించే తేజ మిర్చికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. ఇతర రకాలతో పోలిస్తే ఖమ్మం తేజ మిర్చి ఘాటు ఎక్కువ కావడంతో ఇక్కడి నుంచే కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి పౌడర్, నూనెను విదేశాల్లో భారీగా ఉపయోగించడం వల్ల డిమాండ్ పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. అటు మార్కెట్‌లోనూ మిర్చి పోటెత్తుతోంది. కానీ ధరలు మాత్రం పెరగడం లేదని, ఉన్నతాధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

News April 25, 2025

మరిపెడ: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని పూల బజార్‌కు చెందిన వంశీ(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కాలువ ఒడ్డు ప్రాంతంలో బైక్, ఆటో ఢీ కొనడంతో వంశీ మృతి చెందాడు. కొడుకు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. శుక్రవారం ఉదయం మరిపెడలో అంత్యక్రియలు జరగనున్నాయి.

News April 25, 2025

నర్సాపూర్(జి): విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన గురువారం నర్సాపూర్(జి) మండలంలో జరిగింది. SI సాయికిరణ్ కథనం ప్రకారం.. డొంగర్గాం‌క చెందిన విజయ్(51) ఈనెల 11న జంగిపిల్లి చిన్నయ్య పొలంలో మోటర్ పనిచేయకపోవడంతో మోటర్ పరీక్షిస్తున్నారు. ఈ సమయంలో ట్రాన్స్‌ఫార్మర్‌‌కు తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లగా HYDలో చికిత్స అందించారు. బుధవారం ఇంటికి తీసుకురాగా.. గురువారం మృతిచెందాడు. బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

error: Content is protected !!