News December 17, 2025
చిన్నతనంలో ఊబకాయం రాకూడదంటే..!

చిన్నారుల్లో ఊబకాయం రాకూడదంటే శారీరక, మానసిక అభివృద్ధికి అవసరమైన పోషకాలున్న ఆహారం ఇవ్వాలి. పిల్లలు ఔట్ డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా పిల్లలు బరువు పెరగవచ్చు. పిల్లలు ప్రతిరోజూ కనీసం 8-9 గంటలు నిద్రపోయేలా టైమ్ టేబుల్ సెట్ చేయండి. పిల్లల్లో ఊబకాయాన్ని నివారించడానికి, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News December 18, 2025
ప్రశాంత ఎన్నికలకు సహకరించిన ప్రజలకు సీపీ కృతజ్ఞతలు

సిద్దిపేట జిల్లాలో మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ముగిశాయని పోలీస్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్ కుమార్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో పోలీసులకు వెన్నుదన్నుగా నిలిచి, ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేలా సహకరించిన జిల్లా ప్రజలకు సోషల్ మీడియా వేదికగా సీపీ ధన్యవాదాలు తెలిపారు.
News December 18, 2025
మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం

ప్రధాని మోదీని ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’తో ఆ దేశ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సత్కరించారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మోదీ కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఇరు దేశాధినేతలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(FTA)పై చర్చలు జరిపారు. ప్రస్తుతం భారత్-ఒమన్ మధ్య 12 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరుగుతోంది.
News December 18, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(SIT) దర్యాప్తు చేయనుంది. సభ్యులుగా 9 మంది అధికారులు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు <<18541312>>లొంగిపోయిన<<>> సంగతి తెలిసిందే.


