News February 24, 2026

చిన్నప్పటి బరువు.. పెద్దయ్యాక గుండెపోటు?

image

పదేళ్ల వయసులో ఉండే బాడీ మాస్ ఇండెక్స్, అలాగే 1 నుంచి 18 ఏళ్ల మధ్య పెరిగే బరువు తీరు భవిష్యత్తులో షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పిల్లల బరువులో వచ్చే మార్పుల్లో 25% కేవలం జీన్స్ వల్లే జరుగుతాయని ఈ స్టడీ చెబుతోంది. చిన్నప్పుడు బరువు పెరగడం ఊబకాయం కిందకు రాదని, కానీ ఎదుగుదల వేగాన్ని గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News February 26, 2026

బంధాలకు మిడ్‌లైఫ్‌ క్రైసిస్‌ ముప్పు

image

40 దాటిన తర్వాత చాలామందిని మిడ్ లైఫ్ క్రైసిస్ చుట్టుముడతాయి. పెళ్లి, పిల్లలు, వారి చదువుల తర్వాత దంపతుల్లో మిడ్ లైఫ్ క్రైసిస్ వస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి వ్యక్తిగతంగా, మరి కొన్నిసార్లు బంధాలపై ప్రభావం చూపుతున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే కెరీర్‌ను, కుటుంబాన్ని, ఇష్టాలను బ్యాలెన్స్‌ చేసుకోవాలంటున్నారు. ముందునుంచీ మనసు ఏం కోరుకుంటుందో దానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.

News February 26, 2026

ఒకే జిల్లాకు భార్య కలెక్టర్, భర్త ఎస్పీ

image

TG: రాష్ట్రంలో ఇవాళ <<19241780>>ఐఏఎస్‌ల బదిలీ<<>> తర్వాత ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ కలెక్టర్‌గా స్నేహా శబరీశ్ నియమితులు కాగా అదే జిల్లాకు ఆమె భర్త శబరీశ్ ఎస్పీగా పనిచేస్తుండటం విశేషం. ఒకే జిల్లాకు భార్యాభర్తలు కలెక్టర్, ఎస్పీలుగా ఉండటం అరుదైన విషయం. కాగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న అద్వైత్ కుమార్ సింగ్ మరోచోటుకు బదిలీ అయ్యారు. స్నేహా గతంలో హనుమకొండ కలెక్టర్‌గా పనిచేశారు.

News February 26, 2026

FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర <<19241792>>మరోసారి<<>> తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.870 తగ్గి రూ.1,61,020కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.800 పతనమై రూ.1,47,600 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.