News December 12, 2025

చిన్నస్వామిలో IPL మ్యాచ్‌లకు లైన్ క్లియర్!

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ IPL మ్యాచ్‌లు నిర్వహించేందుకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. జస్టిస్‌ డీకున్హా కమిషన్‌ సూచించిన భద్రతా సిఫార్సులు అమలు చేస్తే మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక క్యాబినెట్‌ నిర్ణయించింది. తొక్కిసలాట ఘటన అనంతరం స్టేడియం భద్రతాపరంగా అనుకూలం కాదని నివేదిక తేల్చడంతో పెద్ద ఈవెంట్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం స్టేడియం పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు.

Similar News

News March 3, 2026

BREAKING: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹490 తగ్గి ₹1,70,020కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు ₹450 తగ్గి ₹1,55,850 పలుకుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.

News March 3, 2026

డ్రోన్ల యుద్ధం!

image

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో డ్రోన్లను పెద్ద సంఖ్యలో వాడుతున్నారు. ఇవాళ రియాద్‌పై, నిన్న అరామ్‌కో ఆయిల్ రిఫైనరీ మీద ఇరాన్ డ్రోన్లతోనే దాడి చేసింది. మిస్సైళ్ల‌తో పోలిస్తే ధర చాలా తక్కువ కావడంతో వీటి వాడకం ఎక్కువైంది. ఇరాన్ Shahed-136 సిరీస్, తుఫాన్.. అమెరికా లూకాస్ డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఒక్కో డ్రోన్ ధర సుమారు $35,000–$50,000 కాగా, ఓ మీడియం రేంజ్ మిస్సైల్ ధర $2M-$3M ఉంటుంది.

News March 3, 2026

ముచ్చటగా మూడోసారి ఎవరిదో పైచేయి!

image

T20 WC సెమీస్‌లో ఎల్లుండి IND-ENG తలపడనున్నాయి. WC చరిత్రలో 2జట్లు రెండుసార్లు తలపడగా చెరోసారి గెలిచాయి. 2022 WC సెమీస్‌లో భారత్‌పై ఇంగ్లండ్ గెలవగా 2024లో ఇంగ్లిష్ జట్టును ఇండియా చిత్తు చేసింది. ఆసక్తికర విషయం ఏమిటంటే 2సార్లు సెమీస్‌లో గెలిచిన జట్టే అంతిమంగా టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో ఈ సారి ఎవరు గెలిచి కప్పు కొడతారనేది ఆసక్తిగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో రెండు జట్లూ బలంగా ఉన్నాయి.