News August 2, 2024
చిన్నారికి అండగా నిలిచిన సిరిసిల్ల కలెక్టర్

వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన చిన్నారి నయనశ్రీ క్యాన్సర్‌తో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆమెకు చికిత్స చేయించేందుకు ముందుకు వచ్చి కుటుంబానికి అండగా నిలిచారు. చిన్నారి తల్లి, తహశీల్దార్ పేరు మీద జాయింట్ ఖాతా ప్రారంభించి రూ.10 లక్షలు జమ చేస్తామన్నారు. క్యాన్సర్‌ను నయం చేసేందుకు మెరుగైన వైద్యం ఎక్కడ అందించాలో పరిశీలించి నివేదిక సమర్పించాలని DMHOను ఆదేశించారు.
Similar News
News August 31, 2025
KNR: నిజాయితీకి చిరునామా.. ఆటో డ్రైవర్ రాజేందర్

కరీంనగర్‌లోని పొలంపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రాజేందర్, గీతాభవన్ వద్ద ఓ ప్రయాణికుడు మరచిపోయిన బ్యాగును తిరిగి అందజేశాడు. ఆ బ్యాగులో నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ప్రయాణికుడు దిగిన చోటికి వెళ్లి బ్యాగును సురక్షితంగా అప్పగించాడు. రాజేందర్ నిజాయితీని స్థానికులు, ప్రయాణికులు అభినందించారు.
News August 31, 2025
KNRలో గిరిజన నాయకులను అరెస్టు చేసిన పోలీసులు

HYDలో జరిగే చర్చా గోష్టికి వెళ్తున్న గిరిజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీమా సాహెబ్, జిల్లా అధ్యక్షుడు మోహన్ నాయక్, శివరాజులను కరీంనగర్‌లో పోలీసులు ఆదివారం హౌస్ అరెస్టు చేశారు. దీంతో గిరిజన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారా, లంబాడీలను ST జాబితా నుంచి తొలగించాలని కుట్రపూరితంగా కోర్టులో కేసు వేసిన సోయం బాపూరావు, వెంకటరావులను అరెస్టు చేయకుండా తమను అడ్డుకోవడం అన్యాయమని మండిపడ్డారు.
News August 31, 2025
KNR: మహిళల పాత్ర అత్యంత కీలకం: మౌలానా

KNRలోని నేషనల్ ఫంక్షన్ హాల్‌లో సిటీ జమాత్ ఉలమా ఆధ్వర్యంలో నిర్వహించిన సీరత్ రసూల్ సభలో ప్రధాన వక్తగా హజ్రత్ మౌలానా అతిఖ్ అహ్మద్ ఖాస్మి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ,, కుటుంబం, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. దైవ ప్రవక్త బోధనలు అమలుపరిస్తేనే సమాజంలో శాంతి, న్యాయం, ఐక్యత సాధ్యమవుతుందని వివరించారు. మహిళలు తాలీం (విద్య), తర్బియత్ (పరిగణన, ఆచరణ) విషయాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.