News March 27, 2025

చిన్నారిపై అత్యాచార ఘటనపై హోం మంత్రి ఆగ్రహం

image

విశాఖ వన్ టౌన్ పరిధిలో చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అత్యాచారానికి పాల్పడిన కీచకుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని మంత్రి ఆదేశించారు. నిందితుడిని గుర్తించినట్లు కమిషనర్ మంత్రికి తెలిపారు.

Similar News

News November 12, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి: MP

image

MHBD జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రత్యామ్నాయ మౌలిక సదుపాయాలు, అవసరమైన ఏర్పాట్లు చేయాలని దిశా కమిటీ ఛైర్మన్, MP బలరాం నాయక్ అన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యంను కొనుగోలు కేంద్రాల సంఖ్య ప్రజావాసరాల దృష్ట్యా అట్టి సంఖ్యను పెంచి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News November 12, 2025

GWL: ‘పీఆర్‌ఓ’ పోలీస్‌ వ్యవస్థకు ముఖచిత్రం: ఎస్పీ

image

ప్రజా సంబంధాల విభాగం (పీఆర్‌ఓ) పోలీస్ వ్యవస్థకు ముఖచిత్రం లాంటిదని ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన మూడు రోజుల శిక్షణలో గద్వాల పీఆర్‌ఓ నవీన్ పాల్గొన్నారు. బుధవారం డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా నవీన్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. జిల్లాకు మంచి పేరు తెచ్చినందుకు ఎస్పీ ఆయనను అభినందించారు.

News November 12, 2025

PDPL: శతాబ్ది ఉత్సవాలకు విజయవంతం చేయాలి: సీపీఐ

image

కార్మిక, కర్షకుల, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీపీఐ అని జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అన్నారు. ఖమ్మంలో జరిగే శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం పెద్దపల్లిలోని పార్టీ కార్యాలయంలో శతాబ్ది ఉత్సవాల కరపత్రం ఆవిష్కరించారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరగనున్న మహాసభకు పెద్దపల్లి జిల్లా నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.