News August 16, 2025
చిన్నారుట్ల గూడెంలో చిరుతపులి కదలికలపై నిరంతర నిఘా

శ్రీశైలం – దోర్నాల మార్గమధ్యంలోని చిన్నారుట్లా గిరిజన గూడెంలో బాలికపై చిరుతపులి దాడి చేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత కదలికల కోసం అన్ని ప్రాంతాలలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత సంచరించే అవకాశం ఉన్నందున దాని కదలికలను పర్యవేక్షిస్తూ తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు దోర్నాల రేంజర్ హరి పేర్కొన్నారు. చెంచు గిరిజనులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు.
Similar News
News August 16, 2025
ADB: ప్రేమకు ప్రతిరూపం రాధాకృష్ణులు

కృష్ణుడి ప్రేమ, ఆధ్యాత్మికతకు ప్రతీక రాధ. రాధాకృష్ణుల ప్రేమ బంధాలకు అతీతమైనది. వారి అనుబంధం దైవిక ప్రేమ, నిస్వార్థ భక్తికి నిలువెత్తు నిదర్శనం. భీంపూర్(M)లో కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం గుబిడిలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకల్లో చిన్నారులు వేసిన శ్రీ కృష్ణుడు, గోపికల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేడుకలు తిలకించేందుకు గ్రామస్థులు ఒకచోట చేరారు.
News August 16, 2025
GWL: లైసెన్స్ సర్వేయర్లకు శిక్షణ.. 130 మందికి అవకాశం

గద్వాల జిల్లాలో లైసెన్స్ సర్వేయర్ల రెండో విడతలో ఎంపికైన 130 మంది అభ్యర్థులకు శిక్షణ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతుందని కలెక్టర్ సంతోష్ తెలిపారు. జిల్లా కేంద్రంలో మొత్తం 50 పనిదినాలు ఈ శిక్షణ ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిక్షణ ద్వారా సర్వేయర్లు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని కలెక్టర్ సూచించారు.
News August 16, 2025
పెద్ద కొడప్గల్: వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సబ్ కలెక్టర్

పెద్ద కొడప్గల్‌లోని శిథిలావస్థకు చేరిన ఇండ్లను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శనివారం పరిశీలించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండకూడదని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.