News January 11, 2025

చిన్నారులకు ఆధార్ జనరేషన్ పూర్తి చేయాలి: అనంత కలెక్టర్

image

జిల్లాలో 0-6 ఏళ్ల చిన్నారులకు ఆధార్ జనరేషన్ నెలాఖరులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆధార్ డీఎల్ఎఎంసీ సమావేశాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో 0-6 ఏళ్ల చిన్నారులు 75,287 ఉన్నారని, ఇప్పటి వరకు 5,798 మందికి ఆధార్ జనరేషన్ పూర్తయిందని తెలిపారు.

Similar News

News August 7, 2025

నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టాడని మహిళ సూసైడ్

image

గుంతకల్లు సోఫియా వీధికి చెందిన షమీం భాను(35) తన భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని, బ్లాక్ లిస్టులో పెట్టాడని మనస్తాపంతో పురుగుమందు తాగి బుధవారం ఆత్మహత్య చేసుకుంది. భాను మొదటి భర్తకు విడాకులు ఇచ్చి గుంతకల్లు సచివాలయ వీఆర్ఓ మహమ్మద్ వలిని గతేడాది వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో బుధవారం తన నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టడంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంతపురం తరలిస్తుండగా మృతిచెందింది.

News August 7, 2025

రైతు కళ్లలో కారం చల్లి రూ.30 వేల పెన్షన్ డబ్బు చోరీ

image

వృద్ధ రైతు కళ్లలో కారం పొడి చల్లి రూ.30 వేలు చోరీ చేసిన ఘటన బ్రహ్మసముద్రం మండలం మాముడూరులో బుధవారం చోటుచేసుకుంది. పొలంలో ఉండగా గుర్తు తెలియని దుండగులు కళ్లలో కారం పొడి చల్లి తన వద్ద ఉన్న రూ.30 వేలు చోరీ చేశారని బాధిత రైతు భూతప్ప తెలిపారు. నెలనెలా పోగేసుకున్న పింఛన్ డబ్బులు మొత్తం దోచుకెల్లారని వాపోయారు. ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు.

News August 7, 2025

నిధుల పెంపు, GST మినహాయింపు కోసం లోక్ సభలో ఎంపీ ప్రస్తావన

image

నిధుల పెంపు & GST మినహాయింపు కోసం లోక్ సభలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి కొరత, రహదారి లేమి, అభివృద్ధి లోపాలు వంటి సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు. MPLADS కింద ఎంపీకి రూ.10 కోట్లకు పెంచాలన్నారు. MPLADS పనులకు పూర్తిగా GST మినహాయింపు ఇవ్వాలని కోరారు. MPLADSలో తక్షణ మార్పులు చేపట్టాలన్నారు.