News February 2, 2025
చిన్నారుల చిత్రహింసలపై.. కలెక్టర్ సీరియస్

జంగారెడ్డిగూడెంలో చిన్నారులను చిత్రహింసలు చేసిన ఘటనపై జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సీరియస్ అయ్యారు. ఆసుపత్రి సిబ్బంది, ఐసీడీఎస్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఆస్పత్రి సిబ్బంది, ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో వారిని సంరక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News February 26, 2026
మాతా-శిశు మరణాలను అరికట్టాలి: కలెక్టర్

మాతా-శిశు మరణాలను అరికట్టేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. స్వస్థ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రక్తహీనతతో హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పౌష్టికాహారంపై అవగాహన పెంపొందించాలని చెప్పారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.
News February 26, 2026
నిజామాబాద్: రూ.151 కే భద్రాచలం తలంబ్రాలు

భద్రాచలంలో మార్చి 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే చేరవేస్తామని నిజామాబాద్ ఆర్ఎం జోత్స్న తెలిపారు. సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల భక్తులు కేవలం రూ.151 చెల్లించి ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు బుక్ చేసుకోవచ్చన్నారు. రాములోరి కళ్యాణానికి వెళ్లలేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News February 26, 2026
HYD: మూసీ సుందరీకరణ.. నిధుల కోసం ఢిల్లీ బాట!

మూసీ పునరుజ్జీవనంపై సర్కారు పట్టుదలతో ఉన్నా, నిధుల వేట సవాలుగా మారింది. రూ.17 వేల కోట్ల మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర బడ్జెట్‌లో ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగేలా కనిపిస్తోంది. సర్వేలు పూర్తయినా, భూసేకరణ, పునరావాసంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కావడంతో నిధుల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.


