News May 16, 2024
చిన్నారెడ్డిని చూస్తూ ఈ స్థాయికి ఎదిగా: సీఎం రేవంత్ రెడ్డి

నేడు హైదరాబాద్‌లోని మాదాపూర్ ఓ హోటల్ జరిగిన జిల్లా లెవెల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి రాజకీయ ప్రస్థానం చూసి ఈ స్థాయికి వచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
Similar News
News September 15, 2025
MBNR: ప్రజావాణికి 15 ఫిర్యాదులు: ఎస్పీ

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి ప్రజల నుంచి 15 వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి సమస్యపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ తెలిపారు.
News September 14, 2025
GREAT: 97 సైబర్ కేసులు.. రూ.32,19,769 రిఫండ్

MBNRలోని నమోదైన సైబర్ క్రైమ్ కేసులను 97 ఛేదించినట్లు సైబర్ క్రైమ్ SI శ్రవణ్ కుమార్ Way2Newsతో తెలిపారు. 97 మంది బాధితులకు సంబంధించి రూ.32,19,769 ఫ్రీజ్ చేయించి రిఫండ్ చేయించామని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బాధితులకు రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేశామన్నారు. బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో SP జానకి, అడిషనల్ ఎస్పీ రత్నం అభినందించారు. సైబర్ నెరగాళ్లతో మోసపోయినట్లు తెలిస్తే గంటలోపు 1930 కాల్ చేయాలన్నారు.
News September 14, 2025
MBNR: ఓపెన్ SSC, INTER గడువు పొడగింపు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 18లోగా (ఫైన్ లేకుండా) ఈనెల 20 లోపు (ఫైన్ తో) అప్లై చేసుకోవచ్చని, www.telanganaopenschool.org వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.