News September 14, 2025

చిన్న చింతకుంట: 24న బ్రహ్మోత్సవాల పనులకు టెండర్లు

image

కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయం వద్ద వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు గాను ఈ నెల 24న సీల్డ్ కవరు టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మధనేశ్వర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఫ్లవర్ డెకరేషన్, లైటింగ్, కలర్స్ వేయడం, చలువ పందిళ్లు, ప్రింటింగ్ మెటీరియల్, టెంటు, పూజా సామగ్రి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి గల వారు టెండర్లు వేయాలని కోరారు.

Similar News

News September 14, 2025

ఆ రైలు నరసాపురం వరకు పొడిగించండి: RRR

image

చెన్నై-విజయవాడ వందేభారత్ రైలు నరసాపురం వరకు పొడిగించాలని శాసనసభ ఉపసభాపతి రఘురామ కేంద్ర రైల్వే కమిటీకి తాజాగా లేఖ రాశారు. భీమవరం మీదుగా నరసాపురం వరకు ఈ రైలు పొడిగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తన విజ్ఞప్తికి అనకాపల్లి ఎంపీ, రైల్వే కమిటీ ఛైర్మన్ సీఎం రమేశ్ సానుకూలంగా స్పందించారని రఘురామ వెల్లడించారు.

News September 14, 2025

NLG: దసరాకు స్పెషల్ బస్సులు

image

దసరా పండుగను పురస్కరించుకుని నల్గొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 705 స్పెషల్ బస్సులను వివిధ ప్రాంతాలకు నడపనున్నారు. ఈ మేరకు రీజియన్ రూపొందించిన నివేదికను ఆర్టీసీ సంస్థ అధికారులు ఆమోదం తెలిపారు. దేవరకొండ డిపో పరిధిలో 131 బస్ సర్వీసులు, కోదాడలో 94, MLG 115, నల్గొండ 89, NKP 36, SRPT 144, యాదగిరిగుట్ట పరిధిలో 96 బస్ సర్వీసులు నడపనున్నారు.

News September 14, 2025

ములుగు జిల్లాలో 422మి.మీ భారీ వర్షపాతం నమోదు

image

ములుగు జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో 422మి.మీ వాన పడింది. సగటు వర్షపాతం 46.8మి.మీగా నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే.. వెంకటాపురంలో 130.2, వాజేడులో 43.6, మంగపేటలో 24.2, వెంకటాపూర్ లో 34.2, ములుగులో 17.2, గోవిందరావుపేటలో 23.6, తాడ్వాయిలో 23.6, ఏటూరునాగారంలో 61.6, కన్నాయి గూడెంలో 63.8మి. మీ వర్షం కురిసింది.