News August 12, 2025

చిన్న చింత కుంటలో అత్యధిక వర్షపాతం

image

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా చిన్నచింతకుంటలో 34.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. జడ్చర్ల 23.3, నవాబుపేట 20.8, కౌకుంట్ల 20.3, మహమ్మదాబాద్, దేవరకద్ర 18.5, మహబూబ్‌నగర్ అర్బన్18.3, అడ్డాకుల 17.8, మూసాపేట మండలం జానంపేట, హన్వాడ 16.8, భూత్పూర్ 16.5, బాలానగర్ 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Similar News

News August 13, 2025

MBNR: దివ్యాంగుల ప్రజావాణికి 19 ఫిర్యాదులు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన వృద్ధులు, దివ్యాంగుల ప్రజావాణికి 19 ఫిర్యాదులు వచ్చినట్టు కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగుల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని జరీనా బేగం, తదితరులు పాల్గొన్నారు.

News August 13, 2025

MBNR : మహమ్మదాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదు

image

MBNR జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మహమ్మదాబాద్ 14.3మి.మీ. వర్షపాతం రికార్డు అయింది. మహబూబ్ నగర్ అర్బన్, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 7.0, హన్వాడ 6.8, కోయిలకొండ మండలం పారుపల్లి 6.0, భూత్పూర్ 5.0, అడ్డాకుల 4.5, , మిడ్జిల్ 4.3, నవాబుపేట 4.0, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్, బాలానగర్ 3.8, కౌకుంట్ల 3.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

News August 12, 2025

MBNR: పోలీసులు కాంగ్రెస్ కు వంత పాడుతున్నారు: MP

image

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌కి పోలీసులు వంత పడుతున్నారని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావును మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై ఆమె స్పందించారు. అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు. హర్ ఘర్ తిరంగా దేశభక్తి కార్యక్రమంలో భాగంగా పెద్దమ్మ గుడిలో పూజలకు వెళుతుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ దురాహంకారం, దౌర్జన్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు.