News March 26, 2025

చిన్న మేరంగి జంక్షన్ వద్ద ఏనుగుల బీభత్సం

image

పార్వతీపురం మన్యం జిల్లా జీఎంవలస చిన్నమేరంగి జంక్షన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చిన్న మేరంగి జంక్షన్ కూరగాయల మార్కెట్‌ ఉన్న షాపులు గజరాజులు ధ్వంసం చేశాయి. కూరగాయలన్నీ నేలమట్టం అవడంతో షాపు యజమాని కన్నీరుమున్నీరుగా విలపించారు. ధ్వంసమైన షాపులకు నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Similar News

News March 26, 2025

నల్గొండ: 3 జిల్లాలకు 3 మంత్రి పదవులు..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రి పదవి రేసులో రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్, బీసీ వర్గం నుంచి బీర్ల ఐలయ్య ఉన్నారు. అయితే సూర్యాపేట జిల్లా నుంచి ఉత్తమ్, నల్గొండ నుంచి కోమటిరెడ్డి మంత్రులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఐలయ్యను క్యాబినెట్‌లోకి తీసుకుంటే భువనగిరి జిల్లాకు కూడా ప్రాతినిధ్యం దక్కినట్లు అవుతుంది. అలాగే దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ పేరు కూడా అమాత్య పదవి రేసులో ఉన్నట్లు చర్చ సాగుతుంది.

News March 26, 2025

భద్రాచలం: భవనం కూలిన ప్రమాదానికి ఇదే కారణం?

image

భ‌ద్రాచలంలో హఠాత్తుగా కూలిన భవనాన్ని ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి నిర్మాణం చేపట్టారట. నిబంధనలకు విరుద్ధంగా అలాగే నాసిరకం పిల్లర్లతో పాత భవనంపైనే నాలుగు అంతస్తుల నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు కూడా ఈ నిర్మాణాన్ని చేపట్టవద్దని హెచ్చరించారు. అటు యజమాని పరారీలో ఉన్నట్లు సమాచారం. కాగా ఈప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్క‌డికక్క‌డే చనిపోయినట్లు తెలుస్తోంది.

News March 26, 2025

‘గిరిజన నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి’

image

కర్నూలు జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ తరగతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెట్కూరు సీఈవో వేణుగోపాల్‌ను కలిసి వినతపత్రం అందచేశారు. టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప మాట్లాడుతూ.. జిల్లాలో ఎంతోమంది గిరిజన నిరుద్యోగ యువత ఉపాధి లేక జీవనాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. అలాంటి వారిని ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక శిక్షణను సెట్కూరు ద్వారా అందించాలని కోరారు.

error: Content is protected !!