News January 13, 2026

చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలడంతో కన్ను కోల్పోయిన చిన్నారి!

image

చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలడంతో ఓ చిన్నారి చూపు కోల్పోయాడు. ఒడిశాలోని టిట్లాగఢ్‌లో అంకేశ్(8) చిప్స్‌ ప్యాకెట్‌లో వచ్చిన టాయ్‌తో ఆడుకుంటూ వంటింట్లోకి వెళ్లాడు. ఆ బొమ్మ స్టవ్‌పై పడి పేలిపోయింది. దీంతో అతడి కంటికి తీవ్ర గాయమై చూపు కోల్పోయాడు. గతనెలలో కంధమల్(D)లో చిప్స్ ప్యాకెట్‌లోని టాయ్ మింగి 4 ఏళ్ల చిన్నారి చనిపోయాడు. ఇలాంటి టాయ్స్ విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News February 4, 2026

రుతుక్రమంపై ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పులు

image

వాతావరణమార్పులతో రుతుక్రమం ప్రభావితం అవుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. బంగ్లాదేశ్‌లోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు 1992-93, 2019-21 సంవత్సరాల్లో జనాభా, ఆరోగ్య సర్వేలు, నాసా వాతావరణ డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో శారీరక ఒత్తిడి పెరిగి హర్మోన్లను నియంత్రిస్తోంది. తద్వారా ఉష్ణప్రాంతాల్లోని బాలికల్లో రుతుక్రమం ఆలస్యమవుతున్నట్లు గుర్తించారు.

News February 4, 2026

‘వారణాసి’ సీక్వెల్‌పై రాజమౌళి క్లారిటీ!

image

‘వారణాసి’ సినిమా గురించి దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని, సుమారు 3 గంటల నిడివితో సింగిల్ పార్ట్‌గానే వస్తుందని స్పష్టం చేశారు. రామాయణంలోని ఓ భాగాన్ని ఇందులో చూపించనున్నట్లు తెలిపారు. మహేశ్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పృథ్వీరాజ్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్, వచ్చే ఏడాది APR 7న పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానుంది.

News February 4, 2026

ఒక్క రోజే రూ.20వేలు పెరిగిన కేజీ సిల్వర్

image

నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.20,000 పెరిగి రూ.3,20,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇదే రేటు కొనసాగుతోంది. అటు బంగారం ధరలు కూడా ఇవాళ <<19045966>>భారీగా పెరిగిన<<>> విషయం తెలిసిందే.