News February 10, 2025
చిరుమళ్ల జాతరకు పోదాం.. చలో.. చలో..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739112963639_1280-normal-WIFI.webp)
సమ్మక్క జన్మస్థలమైన చిరుమల్లలో జాతరకు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్లలో చందా వంశస్థులు ఇక్కడ జరుపుతారు. ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు ఈ నెల 11 నుంచి మొదలు కానున్నాయి. ఎదురుగుట్ట నుంచి పగిడిద్ద రాజును, ముసలమ్మ గుట్ట నుంచి సమ్మక్కను ఇక్కడికి తీసుకొచ్చి కళ్యాణం జరపడం ఈ జాతర ప్రత్యేకత. మేడారం జాతర అయిన మరుసటి ఏడాది ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.
Similar News
News February 10, 2025
రఘునాథపాలెం: పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739183879524_18054828-normal-WIFI.webp)
ప్రజలకు ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్‌ను ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్‌తో కలిసి, వెలుగుమట్ల అర్బన్ పార్క్‌ను సందర్శించారు. రోడ్డు నిర్మాణ పనులు రెండు వైపుల నుంచి జరగాలని, మార్చి 15 నాటికి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
News February 10, 2025
ఖమ్మం: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739182779038_18054828-normal-WIFI.webp)
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, అనుమతి లేకుండా గైర్హాజరు అయిన అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
News February 10, 2025
ఖమ్మం: ‘దివ్యాంగుల అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా చర్యలు’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739183270926_18054828-normal-WIFI.webp)
దివ్యాంగుల అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం దివ్యాంగులు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.