News September 20, 2025
చిరువ్యాపారుల పొట్ట కొడుతున్నారు: కేకే రాజు

నగరంలో చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారని వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. శనివారం సీతమ్మధార ప్రాంతంలో బడ్డీల తొలగింపు ప్రక్రియను ఆయన వ్యాపారులతో కలిసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇటువంటి చర్యలకు ఎప్పుడూ పాల్పడలేదని అన్నారు.
Similar News
News September 20, 2025
విద్యుత్తు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు: సీఎండీ

విద్యుత్తు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్ అన్నారు. విశాఖ సాగర్ నగర్‌లోని ట్రైనింగ్ సెంటర్లో విశాఖ ఐఐఎం సహకారంతో నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధికి శిక్షణా కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. వినియోగదారులకు మరింత చేరువకావడానికి ఉపయోగపడతాయన్నారు. శిక్షణ పూర్తి చేసిన అధికారులకు సర్టిఫికెట్లను అందజేశారు.
News September 20, 2025
విశాఖ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఆర్ఎం

విశాఖ రైల్వే స్టేషన్ డీఆర్ఎం లలిత్ బోహ్ర శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పండుగల రద్దీ కారణంగా రైల్వే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి స్టేషన్‌లో మంచినీటి పైప్ లైన్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్లాట్ ఫామ్‌పై ఉన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత పరిశీలించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో శుభ్రత ప్రమాణాలు పాటించాలన్నారు.
News September 20, 2025
విశాఖ కలెక్టరేట్లో ఉచిత వైద్య శిబిరం

విశాఖ కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొని ఆయన చేతుల మీదుగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 147 మంది సిబ్బంది ఈ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.