News December 1, 2025
చిరు-వెంకీ సాంగ్.. 500 మంది డాన్సర్లతో షూటింగ్

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ నుంచి ఓ అప్డేడ్ చక్కర్లు కొడుతోంది. గచ్చిబౌలిలో భారీ సెట్ వేసి మెగాస్టార్-విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్‌లో సాంగ్ షూట్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. 500 మంది డాన్సర్లతో ఈ పాటను గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నట్లు చెప్పాయి. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీని 2026 సంక్రాంతి బరిలో నిలపనున్నారు.
Similar News
News February 23, 2026
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. IPS ఆఫీసర్ అరెస్ట్

రఘరామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ నాయక్‌ని ఏపీ పోలీసులు బీహార్‌లో అరెస్ట్ చేశారు. బీహార్ కేడర్‌కి చెందిన సునీల్ నాయక్ వైసీపీ హయాంలో డిప్యూటేషన్‌పై సీఐడీలో పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తిరిగి బీహార్ వెళ్లారు. గుంటూరు నగరపాలెం పీఎస్‌లో కేసు నమోదు కాగా సునీల్ నాయక్ నిందితుడిగా ఉన్నారు.
News February 23, 2026
పురుషులు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?

మొలతాడును ఓ సంప్రదాయమే అనుకుంటే పొరపాటే! దీని వెనుక ఆరోగ్య రహస్యాలున్నాయి. పిల్లల్లో హెర్నియా సమస్యలు రాకుండా ఇది రక్షణగా నిలుస్తుంది. శరీరంలో వచ్చే మార్పులను, పొట్ట పెరుగుదలను హెచ్చరిస్తుంది. పూర్వం గోచి ధరించడానికి ఇది ప్రధానాధారం. సామాజికంగా ‘మొలతాడు కట్టిన మగాడివైతే’ అనే సవాలు ఆ వ్యక్తి వివాహానికి అర్హుడైన పురుషుడనే గుర్తింపును సూచిస్తుంది. స్త్రీలకు కూడా చిన్నతనంలో మొలనూలు ధరించే ఆచారం ఉంది.
News February 23, 2026
ఇంజినీరింగ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇంటర్వ్యూతో హైదరాబాద్‌లో 200 ఉద్యోగాలు

HYDలోని <


