News April 14, 2025

చిలకలూరిపేటలో లారీ ఢీకొని వ్యక్తి మృతి

image

చిలకలూరిపేట మండలంలోని మద్దిరాల వద్ద లారీని ఢీకొని వ్యక్తి సోమవారం మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఒంగోలుకు చెందిన షేక్ అబ్దుల్లా(45) షేక్ సాఫాను 2వ వివాహం చేసుకొని మద్దిరాలలో ఉంటున్నాడు. బైక్‌పై వెళుతున్న వ్యక్తిని చిలకలూరిపేట వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో హాస్పిటల్‌కి తీసుకువెళ్లగా చనిపోయాడని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అనిల్ తెలిపారు.

Similar News

News December 15, 2025

నిజామాబాద్: నేటితో ముగియనున్న 3వ విడత ఎన్నికల ప్రచారం

image

నిజామాబాద్ జిల్లాలో 3వ విడత ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5గంటలకు ముగియనుంది. ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల్లో 17న ఎన్నికలు జరగనున్నాయి.165 సర్పంచ్ స్థానాల్లో 19 ఏకగ్రీవం కాగా 146 సర్పంచ్, 1,620 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తంగా 3,26,029 మంది ఓటర్లు ఉన్నారు.

News December 15, 2025

సీడ్ పార్కు… 100 విత్తన ఉత్పత్తి కేంద్రాలు

image

TG: విత్తన ఉత్పత్తి, ఎగుమతుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చేలా ప్రభుత్వం నూతన విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా సీడ్ రీసెర్చ్ పార్కు నెలకొల్పనుంది. అలాగే కొత్తగా 100 విత్తన ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ధి చేయనుంది. వీటిలో 25 లక్షల టన్నుల అధిక నాణ్యత గల విత్తనాలను ఉత్పత్తి చేయనుంది. ఎగుమతి కోసం ‘Inland seed Export facilitation port’నూ నెలకొల్పనున్నట్లు TG రైజింగ్ డాక్యుమెంట్లో తెలిపింది.

News December 15, 2025

పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శం: మంత్రి ఫరూక్

image

పొట్టి శ్రీరాములు త్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని మంత్రి ఫారుక్ పేర్కొన్నారు. వర్ధంతి సందర్భంగా నంద్యాల సంజీవనగర్ గేటులోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆయనే కారణమని మంత్రి తెలిపారు. పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శమని కొనియాడారు.