News January 30, 2025
చిలకలూరిపేట: చిన్నారిపై లైంగిక దాడికి యత్నం

చిలకలూరిపేటలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాల మేరకు.. ఈ నెల 26వ తేదీన చిలకలూరిపేట మండలంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికపై గోవింద్ అనే యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. తోటి పిల్లలు అది గమనించి చుట్టుపక్కల వారికి చెప్పారు. దీంతో యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 2, 2026
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏఎస్‌ఎఫ్, కేజడ్ఆర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా సమన్వయంతో పని చేయాలని సూచించారు. కమిషనర్లు, నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
News January 2, 2026
అధిక వడ్డీ ఆశ చూపి మోసం.. ప్రభుత్వం చర్యలు

AP: కర్నూలు జిల్లాలో అధిక వడ్డీ ఇస్తామంటూ స్కీమ్‌లతో మోసం చేసిన ‘శ్రేయ గ్రూప్’పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓనర్లు హేమంత్ కుమార్, సంగీతారాయ్ పేరిట ఉన్న ఆస్తులు సీజ్ చేసేందుకు CIDకి అనుమతి ఇచ్చింది. దీంతో జూపాడుబంగ్లా మండలం పారుమంచాలలో 51.55 ఎకరాల భూమిని CID సీజ్ చేయనుంది. భార్యాభర్తలైన హేమంత్, సంగీత 8,128 మంది డిపాజిటర్ల నుంచి రూ.206 కోట్లు వసూలు చేసి చేతులెత్తేశారు.
News January 2, 2026
వనపర్తి జిల్లాలో పలువురు ఎస్సైల బదిలీ

వనపర్తి జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ జోగులాంబ గద్వాల జోన్-7 డీఐజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోపాల్‌పేట ఎస్సైగా జగన్మోహన్, వనపర్తి రూరల్‌కు హృషీకేశ్, పెద్దమందడికి జలంధర్‌రెడ్డి బదిలీ అయ్యారు. నరేష్ కుమార్, శివకుమార్‌లను ఎస్పీ కార్యాలయానికి వీఆర్‌గా పంపారు. బదిలీ అయిన అధికారులు త్వరలోనే తమ బాధ్యతలు స్వీకరించనున్నట్లు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.


