News December 14, 2024

చిలుకూరులో CM రేవంత్ రెడ్డి.. భారీ బందోబస్తు

image

చేవెళ్ల నియోజకవర్గంలో CM రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం చిలుకూరు గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, MLA కాలే యాదయ్య ఆయనకు స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను రేవంత్ రెడ్డి ఆసక్తిగా తిలకించారు. CM రాకతో మొయినాబాద్ మండల వ్యాప్తంగా, సభ వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

Similar News

News September 17, 2025

HYD: సాయుధ పోరాటంలో డియర్ కామ్రేడ్స్

image

తెలంగాణ సాయుధ పోరాటం.. HYD సంస్థానంలో విప్లవం రగిల్చిన మహోత్తర ఘట్టం. ప్రాణాలు పోతోన్నా రజాకార్లకు ఎదురొడ్డిన వీర గాథలు కోకొల్లలు. ‘ఏ జంగ్ హై జంగే ఆజాదీ’ నినాదంతో మక్దూం మోహియుద్దీన్ కామ్రేడ్‌లను ఏకం చేస్తే, కమ్యూనిస్ట్, రైతాంగ పోరాటంలో రాజ బహదూర్ గౌ‌ర్‌ కీలకంగా వ్యవహరించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి జైలుకెళ్లారు. ప్రజలను నిత్యం చైతన్యం వైపు నడిపించిన కామ్రేడ్స్ SEP 17న అందరి గుండెల్లో నిలిచారు.

News September 17, 2025

HYD: SEP 17.. ఇదే కదా నిజమైన సాతంత్ర్యం!

image

1947, AUG 15.. దేశమంతా స్వేచ్ఛా గాలులు పీల్చుతుంటే HYD ప్రజలు నిజాం, దొరలు, రజాకార్ల నిర్బంధంలో ఉన్నారు. అప్పటికే(1946) తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పురుడుపోసుకుంది. భారత స్వాతంత్ర్య స్ఫూర్తి HYD సంస్థానాన్ని ఆహ్వానించిందేమో మరి.. ఏళ్లుగా ఏడ్చిన కళ్లు ఎర్రబడ్డాయి. నీ బాంచన్ దొర అన్న జనం బ్యాంచత్ అని రాయి, రప్ప, సుత్తె, కత్తి చేతబట్టి పోరాడారు. చివరకు 1948 SEP 17న ‘ఆపరేషన్ పోలో’తో స్వేచ్ఛను పొందారు.

News September 17, 2025

హైదరాబాద్‌లో 50 మంది CIల బదిలీ

image

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు, పదోన్నతులు జరిగాయి. తాజాగా కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 50 మంది ఇన్‌స్పెక్టర్లకు బదిలీ, పదోన్నతి ఇచ్చినట్లు వెల్లడించారు. చాలా రోజుల నుంచి ఒకే పోస్టింగ్‌లో ఉన్న వారిని సైతం ఇతర ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు.