News October 11, 2024

చిల్లకూరులో కన్న తల్లిని కడతేర్చిన కొడుకు

image

కన్న తల్లిని కన్న కొడుకే కడతేర్చిన ఘటన చిల్లకూరు మండలం, కమ్మవారిపాలెంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు గ్రామంలో కాపురముంటున్న సుశీలమ్మ కొడుకు మద్యం తాగొచ్చాడని మందలించింది. ఈ నేపథ్యంలో ఆవేశంతో కత్తితో కుమారుడు తల్లి తల మీద నరికాడు. వెంటనే గూడూరు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మహిళ మృతి చెందింది. ఘటనపై చిల్లకూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News February 6, 2026

CMపై అంబటి విమర్శలు.. మౌనంలో నెల్లూరు MPలు, మంత్రులు!

image

CM చంద్రబాబుపై YCP నేత అంబటి రాంబాబు చేసిన ఘాటు విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీనిపై స్పందించేందుకు నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎంపీలు వేమిరెడ్డి, బీదలు, మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి కనీసం స్పందించక పోవడం గమనార్హం. కనీసం ప్రెస్‌మీట్‌లలోనూ అంబటి వ్యాఖ్యలపై స్పందించ లేదనేది తెలుస్తోంది. నెల్లూరులో రాజకీయాలు ఎప్పుడు..? ఎలా..? రూటు మారుతాయో తెలియడం లేదు.

News February 6, 2026

నెల్లూరు: మితిమీరుతున్న గంజాయి అరాచకాలు!

image

గంజాయి పేరు వింటేనే నెల్లూరు జిల్లా ఉలిక్కిపడుతుంది. ఇందుకు నెల్లూరు కల్లూరు పల్లిలో ఉద్యమకారుడి దారుణ హత్య, కోవూరులో మైనర్ బాలికపై హత్యాయత్నం వంటి ఘటనలే ఉదాహరణ. జిల్లాలో ఏదో ఒకచోట నిత్యం గంజాయి పట్టుబడుతూనే ఉంది. రోడ్లపై కత్తులతో హల్‌చల్ వంటి ఘటనలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పోలీసులు నామమాత్రంగా తనిఖీలు చేపడుతున్నారని విమర్శలు ఉన్నాయి. వీటి మూలాలను పూర్తిగా నాశనం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

News February 6, 2026

తత్కాల్ ఫీజు చెల్లింపునకు 12 వరకు అవకాశం

image

పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫీజును చెల్లించేందుకు ఈ నెల 12 వరకు గడువుందని డీఈఓ బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. తత్కాల్ ఫీజు కింద రూ.వెయ్యి అపరాధ రుసుమును చెల్లించాలని కోరారు. అదే తేదీలోపు అన్ని డాక్యుమెంట్లతో నామినల్ రోల్స్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. వివరాలకు bse.ap.gov.in లేదా దర్గామిట్ట జడ్పీ స్కూల్లో గల జిల్లా పరీక్షల విభాగాన్ని సంప్రదించాలని కోరారు.