News November 13, 2025

చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం: విప్ ఆది శ్రీనివాస్

image

సిరిసిల్ల: ఆరుగాలం కష్టపడి పండించిన పంటల్లో చివరి గింజ కొనుగోలు వరకు అధికారులు రైతులకు అండగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. ఖరీఫ్ సీజన్ 2025-26లో వరి, పత్తి, మక్కల కొనుగోళ్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు.

Similar News

News November 13, 2025

జిల్లాలో వారిపై నిఘా ఉంచాలి: అనకాపల్లి ఎస్పీ

image

జిల్లాలో తరచూ నేరాలకు పాల్పడుతున్న నేరస్తులపై నిఘా ఉంచాలని ఎస్పీ తుహీన్ సిన్హా పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. గత నెలలో నమోదైన నేరాలు, కేసుల దర్యాప్తు, పురోగతి, పెండింగ్ వారెంట్లుపై ఆరా తీశారు. ట్రాఫిక్ సమస్యలపై చర్చించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో సమన్వయం కొనసాగిస్తూ కేసులలో శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News November 13, 2025

2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలు: CM

image

AP: రూ.8.87 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్‌లో అనుమతి ఇచ్చామని, దీని ద్వారా 8 లక్షల ఉద్యోగాలు వస్తాయని CM CBN చెప్పారు. ఇవాళ రూ.2.66 లక్షల కోట్ల పెట్టుబడులకు MoUలు జరిగాయని విశాఖ ఎకనమిక్ రీజియన్ సదస్సులో వెల్లడించారు. సంపద సృష్టి కోసం అందరం జట్టుగా పని చేశామని, 20 లక్షల ఉద్యోగాల హామీని నిరూపించామని పేర్కొన్నారు. 2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలకు పెంచడమే తమ లక్ష్యమన్నారు.

News November 13, 2025

స్వచ్ఛ ఆంధ్రలో ప్రతి అధికారి పాల్గొనాలి: కలెక్టర్

image

స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ శనివారం నాడు నిర్వహించే శుభ్రత కార్యక్రమంలో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ, భవనాలు, లేవుట్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై చర్చించారు.