News January 6, 2026
చివరి టెస్టు.. పట్టు బిగించిన ఆసీస్

యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్సులో ఇంగ్లండ్ 384 పరుగులకు ఆలౌటవగా, ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 518/7 స్కోర్ చేసింది. దీంతో 134 పరుగుల లీడ్ సాధించింది. హెడ్ 163, స్టీవ్ స్మిత్ 129* అద్భుత సెంచరీలు చేశారు. కార్సే 3, స్టోక్స్ 2, జోష్, జాకోబ్ చెరో వికెట్ తీశారు. కాగా ఇప్పటికే 3-1 తేడాతో ఆసీస్ సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
Similar News
News February 21, 2026
మదనపల్లె మృగాడు మృతి.. CM ఏమన్నారంటే?

AP: మదనపల్లె హత్యాచార నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్యపై CM చంద్రబాబు వినుకొండ సభలో స్పందించారు. ‘మదనపల్లెలో గంజాయి సేవించి మానవ మృగంగా ప్రవర్తించాడు. ఆడబిడ్డల జోలికొస్తే అది వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించా. చట్టం కఠినంగా వ్యవహరిస్తుందన్న భయంతో అతను ప్రాణాలు తీసుకున్నాడు’ అని చెప్పారు. ఘటన అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకోగా మృతదేహాన్ని తీసుకోవడానికి కుటుంబీకులు ముందుకు రాని విషయం తెలిసిందే.
News February 21, 2026
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News February 21, 2026
అభిషేక్ ఫామ్‌పై కెప్టెన్ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

T20WCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ అభిషేక్ డకౌట్ కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కెప్టెన్ సూర్య స్పందించారు. అభి గురించి ఆందోళన పడుతున్నవారి గురించి తాను ఆందోళన పడుతున్నట్లు చమత్కరించారు. అతడిని ఎదుర్కోబోతున్న ప్రత్యర్థి జట్లపై మరింత ఆందోళనగా ఉందన్నారు. అభి బ్యాట్‌తో ఏం చేస్తాడో గతేడాది చూశామని, ప్రస్తుతం మద్దతుగా నిలవాల్సిన టైమ్ అని చెప్పారు. దీంతో రేపటి మ్యాచ్‌లో అభిషేక్ ఆడటం కన్ఫర్మ్ అయినట్లే.


