News September 25, 2025
చివరి దశలో రాజధానిలో తొలి శాశ్వత భవనం

రాజధానిలో తొలి శాశ్వత భవనంగా CRDA ప్రధాన కార్యాలయం రికార్డు నెలకొల్పనుంది. కార్పొరేట్ ఆఫీసులకు దీటుగా అత్యాధునిక డిజైన్, ఇంటీరియర్‌తో రూపుదిద్దుకున్న ఈ జీ+7 భవనం విజయదశమి పండుగ సందర్భంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం. రూ.240కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కార్యాలయం, రాయపూడి సమీపాన ఉంది. టెర్రస్‌పై ఫుడ్ కోర్ట్, జిమ్ వంటి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇది రాజధాని నిర్మాణంలో ఒక మైలురాయిగా నిలువనుంది.
Similar News
News September 27, 2025
GNT: సౌందరరెడ్డి కేసు విచారణ వాయిదా

వైసీపీ వాలంటీర్స్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సౌందరరెడ్డి కేసు విచారణను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘనందన్, టీసీడీ శేఖర్ ధర్మాసనం అక్టోబర్ 13కు వాయిదా వేసింది. పోలీసులు చట్టవిరుద్దమైన చర్యలను కప్పిపుచ్చుకునే క్రమంలోనే సౌందరరెడ్డిపై గంజాయి కేసు నమోదు చేసినట్లు భావిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలోనే విచారణ చేసి పూర్తి నివేదికను ఇవ్వాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీచేసింది.
News September 27, 2025
తుళ్లూరు: 97 మందికి రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు

అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం(ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామాల రైతులకు శుక్రవారం విజయవాడలోని CRDA కార్యాలయంలో ఈ- లాటరీ విధానంలో 97 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 41 నివాస ప్లాట్లు కాగా 36 వాణిజ్య ప్లాట్లు, 20 ప్రత్యామ్నాయ ప్లాట్లు మొత్తం 56 మంది రైతులు, భూయజమానులకు ప్లాట్లను కేటాయించడం జరిగిందన్నారు. CRDA స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులున్నారు.
News September 27, 2025
గుంటూరు జిల్లాలో వర్షం

వాయువ్య,దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నాటికి కృష్ణానది వరద ప్రకాశం బ్యారేజి వద్ద 2.39 లక్షల క్యూసెక్కులు, ఉందని తెలిపారు. శనివారం గుంటూరు, పల్నాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.