News February 5, 2026
చీకటి పడ్డాక మార్స్ గ్రహం ఇలా ఉంటుంది!

మార్స్ గ్రహంపై రాత్రిళ్లు ఎలా ఉంటుందో చూపే దృశ్యాన్ని నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ బంధించింది. శాస్త్రవేత్తలు ఇటీవల డ్రిల్ చేసిన ఒక శిలలోని పొరలను నిశితంగా పరిశీలిస్తున్న సమయంలో ఈ అరుదైన ఫొటోను తీశారు. ఎర్రటి గ్రహంపై చీకటి పడిన తర్వాత అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో ఈ చిత్రం స్పష్టంగా చూపిస్తోంది. అంతరిక్ష రహస్యాలను ఛేదించే క్రమంలో రోవర్ పంపిన ఈ ఫొటో అంతరిక్ష ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Similar News
News February 10, 2026
బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి హత్య

బంగ్లాదేశ్‌లో మైనార్టీల హత్యలు కొనసాగుతున్నాయి. మిమెన్‌సింగ్ జిల్లాలో హిందూ వ్యాపారి సుసేన్ చంద్ర సర్కార్‌ను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. దక్షిణకందా గ్రామానికి చెందిన సర్కార్ దగ్గరలోని బోగర్ బజార్‌లో బియ్యం వ్యాపారం చేస్తున్నారు. హత్య తర్వాత షాపులో నుంచి లక్షల రూపాయలను దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు. రెండు రోజుల్లో జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా హత్య కలకలం రేపుతోంది.
News February 10, 2026
రంజాన్ మాసం.. ముస్లిం ఉద్యోగులకు గుడ్ న్యూస్

AP: రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉపవాసాల నేపథ్యంలో ఒక గంట ముందే ఇంటికి వెళ్లేందుకు అనుమతించింది. ఈనెల 18 నుంచి మార్చి 19 వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగులు డ్యూటీ నుంచి ఒక గంట ముందే ఇంటికి వెళ్లొచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
News February 10, 2026
మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం

భార్యాభర్తల జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అహం అడ్డం, ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటిని దాటితేనే బంధం పదిలంగా మారుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చి అలిగినా తెగేదాకా లాగొద్దు. భాగస్వామితో నేరుగానే మాట్లాడి పరిష్కరించుకోండి. సమస్య ఏదైనా ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారిలో రోజు రోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.


