News September 20, 2025

చీకట్లో కరీంనగర్ స్మార్ట్ సిటీ

image

కరీంనగర్ కార్పొరేషన్‌లో స్ట్రీట్ లైట్స్ నిర్వహణ చూసే EESL ఏజెన్సీ కాంట్రాక్ట్ ముగియడంతో స్ట్రీట్ లైట్స్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. నగరవ్యాప్తంగా 11 వేల వీధిలైట్లు ఉండగా 150 CCMS బాక్సులు, టైమర్స్, సెన్సార్లు, బ్రేకర్లు రిలేలు పనిచేయడం లేదు. రోజుకు 140 వరకు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Similar News

News September 20, 2025

పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

image

పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ ఏకైక కుమారుడు డా.అంజన్(55) గుండె పోటుతో శనివారం ఉదయం మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇవాళ ఉదయం ఆయనకు ఇంటి వద్ద గుండె పోటు రాగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అంజన్ మృతదేహాన్ని ఆయన ఇంటికి తరలించారు. నాయకులు, ప్రజలు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు.

News September 20, 2025

HYD: ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

image

బహదూర్‌పూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వెస్టర్న్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రధాన నిందితుడు గిరీష్ అగర్వాల్, ఆరుగురు ఏజెంట్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 వేల నగదు, 55 సెల్‌ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, 60 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ‘స్కెచ్’, ’99 రేస్’ వంటి పేర్లతో నిందితులు బెట్టింగ్ యాప్‌లను నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

News September 20, 2025

నవంబర్ 14న నాగార్జున ‘శివ’ రీరిలీజ్

image

అక్కినేని నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘శివ’ సినిమా రీరిలీజ్ తేదీ ఖరారైంది. ఇండియన్ సినిమాను షేక్ చేసిన ‘శివ’ నవంబర్ 14న రీరిలీజ్ అవుతుందని నాగ్ ట్వీట్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. 4K క్వాలిటీ & డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. అమల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు.