News April 15, 2025
చీకోటి ప్రవీణ్‌పై నల్గొండలో కేసు నమోదు

బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ కుమార్‌పై నల్గొండ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నల్గొండలో జరిగిన హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న చీకోటి ప్రవీణ్ కుమార్ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులొచ్చాయి. దీంతో అతనిపై 188, 153 సెక్షన్ల కింద నల్గొండ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
Similar News
News April 16, 2025
NLG: హత్యాయత్నం కేసులో ఒకరికి జైలు శిక్ష

గిరిజన మహిళపై హత్యాయత్నం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ NLG SC, ST కోర్టు జడ్జి రోజారమణి బుధవారం తీర్పునిచ్చారు. 2018 అక్టోబర్ 13న రాత్రి నాంపల్లిలోని దామెరకు చెందిన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన మహేశ్ పత్తి చేలోకి తీసుకెళ్లి ఆమెపై యాసిడ్ పోసి హత్యాయత్నం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి జైలు శిక్ష విధించారు.
News April 16, 2025
2 రోజుల్లో స్థలాన్ని గుర్తించాలి: ఇలా త్రిపాఠి

శివన్న గూడెం రిజర్వాయర్ కింద ముంపునకు గురయ్యే గ్రామాల స్థానంలో ఏర్పాటు చేయనున్న పునరావాస కేంద్రాలకు 2 రోజుల్లో స్థలాన్ని గుర్తించాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె చండూరు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీదేవి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఇతర అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
News April 16, 2025
NLG: మరోసారి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు వాయిదా

నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ 17 నుంచి 15 వరకు జరగాల్సిన డిగ్రీ పరీక్షలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు సీఓఈ డా. ఉపేందర్ రెడ్డి బుధవారం తెలిపారు. తదుపరి నిర్వహణ తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అంతకుముందు ఏప్రిల్ 11, 15, 16న డిగ్రీ పరీక్షలను వాయిదా వేయడం తెలిసిందే.