News February 20, 2026
చీనీ ధరలు పెంపు.. రైతుల సంతోషం

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.25 వేల ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి రాఘవేంద్ర కుమార్ తెలిపారు. మార్కెట్‌కు మొత్తం 462 టన్నుల దిగుమతి రాగా.. నాణ్యతను బట్టి కనిష్ఠంగా రూ.8 వేలు, సరాసరిగా రూ.17 ధర లభించినట్లు పేర్కొన్నారు. కొన్ని రోజులతో పోలిస్తే ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 25, 2026
నల్గొండ జిల్లాలో ముగ్గురు వైద్యులపై వేటు

రాష్ట్రంలో విధులకు హాజరుకాకుండా దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న 94 మంది వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నల్గొండ జిల్లాకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రియదర్శిని, మాధురి, శ్రీవిద్య మాధ ఉన్నారు.
News February 25, 2026
భద్రత కల్పించాలన్న కాటసాని పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

తనకు భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాటసాని రాంభూపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం పోలీసు భద్రతనేది హోదాగా మారిందని, దానికి ప్రభుత్వ ధనం ఎందుకు ఖర్చు చేయాలని CJI ధర్మాసనం కాటసాని లాయర్‌ను ప్రశ్నించింది. శక్తిమంతులైన మీరు ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. మీకు ముప్పు ఉంటే నిఘా వ్యవస్థలు అంచనా వేస్తాయని పేర్కొంది.
News February 25, 2026
భూపాలపల్లి: తొలిరోజు పరీక్షకు 1,772 మంది హాజరు

జిల్లాలో ఇంటర్ పరీక్షల కోలాహలం మొదలైంది. బుధవారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 1,829 మంది విద్యార్థులకు గాను 1,772 మంది పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని, తాగునీరు, ఇతర సౌకర్యాల్లో లోటు లేకుండా చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.


