News September 25, 2025

చీపురి పట్టిన కర్నూలు కలెక్టర్ డా.సిరి

image

కర్నూలులో గురువారం నిర్వహించిన ‘ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పాల్గొన్నారు. తుంగభద్ర నది సమీపంలోని సంకల్ భాగ్ వద్ద చీపురుపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. పరిశుభ్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని, ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. శుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు.

Similar News

News September 25, 2025

క్విజ్ పోటీల్లో పాల్గొనండి: కలెక్టర్

image

జిల్లా యువజన సంక్షేమ శాఖ-సెట్కూరు ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్(VBYLD) క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.సిరి తెలిపారు. ఈ క్విజ్‌లో 15-29 ఏళ్ల యువత ఉచితంగా పాల్గొనవచ్చన్నారు. జాతీయ యువజన ఉత్సవం-2026లో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు అక్టోబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో జరుగుతాయన్నారు. తెలుగు సహా 12 భాషల్లో బహుళైచిక ప్రశ్నల రూపంలో నిర్వహించనున్నట్లు వివరించారు.

News September 25, 2025

నీటి కుంటలో పడి ఇంటర్ విద్యార్థి మృతి

image

నీటి కుంటలో పడి ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. కర్నూలు మండలం పసుపుల సమీపంలో నీటి కుంటలో పడి సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థి శ్రీనివాసులు(17) మృతి చెందాడు. కళాశాలకు వెళ్లి ఇంటికి చేరకుండా నీటి కుంటలో శవమై తేలాడు. విద్యార్థి మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు తాలూకా పోలీసులు నలుగురు విద్యార్థులను విచారిస్తున్నారు.

News September 25, 2025

పెండింగ్ కేసులు తగ్గించండి: ఎస్పీ

image

పెండింగ్ కేసులు తగ్గించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల ఛేదనకు టెక్నాలజీ ఉపయోగించాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ప్రతీ కేసును 60 రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నారు. వివిధ అంశాలపై చర్చించారు.