News March 24, 2025
చీపురుపల్లి: అబ్బాయ్‌ను బాబాయ్ పక్కన పెడుతున్నారా..?

చీపురుపల్లి TDPలో కలహాలు తారస్థాయికి చేరుకున్నాయనే గుసగుసలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ప్రస్తుత MLA కళా వెంకట్రావుకు, TDP జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మధ్య పొసగడం లేదని టాక్. ఇటీవల TDP ఆఫీస్ ప్రారంభానికీ నాగార్జున రాకపోవడం ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది. రానున్న ఎన్నికల్లో తన కుమారుడు రామ్ మల్లిక్‌కు లైన్ క్లియర్ చేసేందుకు కళా యత్నిస్తున్నట్లు చర్చ నడుస్తోంది.
Similar News
News March 26, 2025
VZM: భౌతికశాస్త్రం పరీక్షకు 119 మంది విద్యార్థులు గైర్హాజరు

విజయనగరం జిల్లాలో 119 పరీక్షా కేంద్రాలలో జరిగిన 10 వతరగతి పరీక్షలలో బుధవారం జరిగిన భౌతిక శాస్త్రం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి యు. మాణిక్యంనాయుడు తెలిపారు. ఈ పరీక్షలు 119 పరీక్ష కేంద్రాలలో రెగ్యులర్ విద్యార్థులు 22,919మంది హాజరు కావాల్సి ఉండగా 22,919 మంది హజరు కాగా 119 మంది గైర్హాజరు అయ్యారన్నారు.
News March 26, 2025
‘విజయనగరం జిల్లాలో రూ.194 కోట్లు చెల్లించాం’

విజయనగరం జిల్లాలో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 91,836 మంది రోగులు వైద్య సేవలు పొందారని జిల్లా మేనేజర్ రాంబాబు తెలిపారు. జిల్లాలో 66 ప్రభుత్వ ఆసుపత్రులు, 25 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో మొత్తం రూ.194 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రూ.20లక్షల వరకు ప్యాకేజీ పెంచినట్లు వెల్లడించారు.
News March 26, 2025
గొల్లాదిలో కొట్లాట.. ఏడుగురుకి గాయాలు

బాడంగి మండలం గొల్లాది పోలమ్మ ఆలయం సమీపంలో కామన్నవలస, గొల్లాది గ్రామానికి చెందిన వారి మధ్య మంగళవారం కొట్లాట జరిగినట్లు ఎస్ఐ తారకేశ్వరరావు చెప్పారు. ఆలయం సమీపంలో గొల్లాదికి చెందిన ఈపు ఈశ్వరరావు మేకలు మేపుతుండగా కామన్నవలసకి చెందిన ఆదినారాయణ మేకలు మేపేందుకు వచ్చాడు. వారి మధ్య కొట్లాట జరగడంతో ఇరువర్గాలకు చెందిన ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.