News February 9, 2025

చీపురుపల్లి అమ్మవారి జాతరకు ముహూర్తపురాట

image

చీపురుపల్లి మేజర్ పంచాయతీలో వెలసిన ఉత్తరాంధ్ర కల్పవల్లిగా పూజించే శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి జాతరకు తొలి ఘట్టం మొదలైంది. ఆలయ ప్రాంగణంలో ఈవో బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం ముహూర్తపురాట వేశారు. ఈవో మాట్లాడుతూ.. మార్చి నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు అమ్మవారి జాతరను నిర్వహిస్తున్నామన్నారు. జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

Similar News

News February 10, 2025

ఉత్తరాంధ్ర టీచర్ MLC స్థానానికి నామినేషన్లు వేసింది వీరే

image

➤ పాకలపాటి రఘువర్మ
➤ గాదె శ్రీనివాసులు నాయుడు
➤ కోరెడ్ల విజయ గౌరీ
➤ కోసూరు రాధాకృష్ణ
➤ సత్తలూరి శ్రీరంగ పద్మావతి
➤ నూకల సూర్యప్రకాశ్
➤ రాయల సత్యనారాయణ
➤ పోతల దుర్గారావు
➤ పెదపెంకి శివప్రసాద్
➤ సుంకర శ్రీనివాసరావు
NOTE: నేటితో నామినేషన్లకు గడువు ముగిసింది.

News February 10, 2025

బెస్ట్ విలన్ టాలెంట్ అవార్డు అందుకున్న బాడంగి దాసరి

image

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ విలన్ టాలెంట్ అవార్డును బాడంగికి చెందిన దాసరి తిరుపతినాయుడు ఆదివారం అందుకున్నారు. విప్లవ నటుడు ఆర్.నారాయణమూర్తి నటించిన యూనివర్సిటీ చిత్రంలో విలన్’గా దాసరి నటించాడు. బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన తిరుపతినాయుడు డ్రామా ఆర్టిస్టుగా పనిచేసేవారు. సినిమాలో అవకాశం రావడంతో విలన్’గా నటించి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.

News February 10, 2025

VZM: 3 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు DMHO డాక్టర్ జీవనరాణి తెలిపారు. ఈ మాత్రల పంపిణీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతుందన్నారు. మాత్రలను నమిలి మింగాల్సి ఉంటుందని, దీంతో పిల్లల్లో ఉండే నులి పురుగులు నశించి రక్తహీనత బారిన పడకుండా ఉంటారని తెలిపారు. ఏడాదికి రెండుసార్లు నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

error: Content is protected !!