News March 2, 2025
చీపురుపల్లి కనక మహాలక్ష్మిని దర్శించుకున్న జడ్పీ ఛైర్మన్

చీపురుపల్లి కనకమహాలక్ష్మి జాతర మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని ZPఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, కమిటీ సభ్యులు శాస్త్రోక్తంగా ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. జాతరలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
Similar News
News March 3, 2025
VZM: అధికారులతో కలెక్టర్ అంబేడ్కర్ సమీక్ష

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఈవోపీఆర్డీలతో సమీక్ష జరిపి ఆయా శాఖల పనితీరుపై ఆరా తీశారు. గ్రామాలు, పట్టణాల్లో తాగునీరు, ఉపాధి హామీ, ఎంఎస్ఎంఈ సర్వే, తదితర అంశాలపై చర్చించారు. వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.
News March 3, 2025
మానస.. ఆత్మ స్థైర్యానికి సెల్యూట్..!

చదవాలన్న సంకల్పం ముందు మానసిక అంగవైకల్యం తలవంచింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వి.ఎం.పేటకు చెందిన పెట్ల మానస ఇంటర్ పరీక్షలకు హాజరైంది. చిన్నప్పటి నుంచి మానసికస్థితి సరిగా లేకపోయినా తల్లిదండ్రుల సాయంతో చదువు కొనసాగిస్తోంది. ప్రస్తుతం HEC సెకండియర్ చదువుతున్న మానస.. తన తండ్రి దేముడు సాయంతో సోమవారం పరీక్షకు హాజరయ్యింది. సహాయకురాలి సాయంతో పరీక్ష రాసింది. ఆమె ఆత్మ స్థైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.
News March 3, 2025
VZM: నేటి నుంచి ఇంటర్ సెకిండియర్ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. విజయనగరం జిల్లాలో 177 అన్ని యాజమాన్య కళాశాలల నుంచి 20,368 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 166 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి.