News February 28, 2026
చీపురుపల్లి: నువ్వు ఏమవుతావు? అని అడిగిన CM

సీఎం చంద్రబాబు శనివారం చీపురుపల్లిలో పర్యటించారు. చీపురుపల్లి CHCని పరిశీలించారు. అక్కడ ఉన్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ‘నువ్వు ఎం కావాలి అనుకుంటున్నావు’ అని ఓ విద్యార్థిని సీఎం అడగగా డాక్టర్ కావాలని అనుకుంటున్నానని చెప్పింది. అనంతరం విద్యార్థికి సీఎం ఆటోగ్రఫ్ ఇచ్చారు.
Similar News
News March 2, 2026
విండీస్‌పై విజయం.. భారత్ కొత్త రికార్డులు

T20WC: వెస్ట్ఇండీస్‌పై విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్ ఈ మ్యాచ్‌తో కొత్త రికార్డులు నమోదు చేసుకుంది. 196 పరుగల లక్ష్యాన్ని ఛేదించడంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత్ తన హైయెస్ట్ సక్సస్‌ఫుల్ ఛేజ్ నమోదు చేసింది. అలాగే ఇంగ్లండ్, సౌతాఫ్రికా తర్వాత అతిపెద్ద టోటల్‌ను ఛేజ్ చేసిన మూడో జట్టుగా నిలిచింది. T20WCలో సెమీస్‌కు ఆరుసార్లు క్వాలిఫై అయిన జట్టుగా ఇంగ్లండ్, పాక్ సరసన నిలిచింది.
News March 2, 2026
డీల్‌కు అతి చేరువలో ఉండగా US దాడి చేసింది: ఇరాన్ మంత్రి

అణు ఒప్పందానికి అతి చేరువలో ఉండగా US దాడులు చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయిద్ అబ్బాస్ అరాఘ్చి విమర్శించారు. చర్చలు జరుగుతుండగానే దాడులు చేసి దౌత్యాన్ని ట్రంప్ నాశనం చేశారన్నారు. చివరగా జెనీవాలో చర్చలు జరిగాక వచ్చే సమావేశంలో ఈ డీల్ ఖాయం చేసుకోవాలని అనుకున్నామని తెలిపారు. కాగా ఇరాన్ డీల్‌కు సుముఖంగానే ఉన్నా ట్రంప్ కావాలనే దాడులు చేయించినట్లు వెస్ట్ మీడియాలో పలు ఆరోపణలు వస్తున్నాయి.
News March 2, 2026
కామారెడ్డి: ‘ఆపరేషన్ కవచ్’ సక్సెస్

కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా అమలు చేస్తున్న ‘ఆపరేషన్ కవచ్’ సత్ఫలితాలను ఇస్తోంది. రామారెడ్డి(M) పోసానిపేట వాసి పెంటయ్య ట్రాక్టర్‌ను నిందితులు దొంగిలించి బాన్సువాడలో విక్రయించేందుకు తరలిస్తుండగా ఆదివారం పద్మాజీవాడి X రోడ్డు వద్ద ‘ఆపరేషన్ కవచ్’ తనిఖీల్లో భాగంగా గాంధారి SI ఆంజనేయులు అడ్డుకున్నారు. నిందితులు గండ్ర స్వామి, వడ్ల విజయ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు.


