News December 20, 2025
చీపురు పట్టిన కర్నూలు కలెక్టర్ సిరి

కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.సిరి స్వయంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. జేసీ నూరుల్ ఖమర్‌తో కలిసి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రతి ఒక్కరూ తమ కార్యాలయాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.
Similar News
News December 25, 2025
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మందు బాబులకు అలర్ట్

TG: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మందు కొట్టి విచ్చలవిడిగా రోడ్లపై వాహనాలతో తిరిగే వారిపై పోలీసులు చర్యలకు దిగుతున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10వేల జరిమానాతో పాటు వెహికల్ సీజ్, గరిష్ఠంగా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాల్లో 304 వాహనాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు.
Share it
News December 25, 2025
వ్యాధుల ముప్పు కోళ్లలో తగ్గాలంటే?

ఏదైనా కోడిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే మిగిలిన కోళ్ల నుంచి దాన్ని వేరుచేయాలి. వ్యాధితో ఏదైనా కోడి చనిపోతే దాన్ని దూరంగా లోతైన గుంతలో పూడ్చిపెట్టాలి లేదా కాల్చేయాలి. కోళ్ల షెడ్డులోకి వెళ్లేవారు నిపుణులు సూచించిన క్రిమిసంహారక ద్రావణంలో కాళ్లు కడుక్కున్న తర్వాతే వెళ్లాలి. కోడికి మేతపెట్టే తొట్టెలు, నీటితొట్టెలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్డులో లిట్టరును గమనిస్తూ అవసరమైతే మారుస్తుండాలి.
News December 25, 2025
హుజూర్‌నగర్: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

క్రిస్మస్ సందర్భంగా హుజూర్‌నగర్ పట్టణంలోని పలు చర్చిల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. చర్చిలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఎస్సీలు క్రిస్టియన్ మతం స్వీకరిస్తే ఎస్సీ సర్టిఫికెట్, రిజర్వేషన్లు కోల్పోతారన్న అభిప్రాయానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.


