News April 19, 2025
చీపురు పట్టిన హోంమంత్రి అనిత

గుంటూరు పోలీస్ కార్యాలయం ఆవరణలో హోంమంత్రి వంగలపూడి అనిత చీపురు పట్టి చెత్తను తొలగించి శుభ్రం చేశారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి మంత్రి శ్రమదానం నిర్వహించినట్లు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని హరిత ఆంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News April 20, 2025
DSC: కర్నూలు జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ ఉదయం 10 గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. కర్నూలు జిల్లాలో 209 ఎస్ఏ పీఈటీ, 1,817 ఎస్జీటీ పోస్టులతో కలిపి మొత్తం 2,645 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి 10 ఎస్జీటీ పోస్టులతో కలిపి జిల్లాలో మొత్తం 33 పోస్టులు ఉన్నాయి.
News April 20, 2025
DSC: అనంతపురం జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ ఉదయం 10 గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. అనంతపురం జిల్లాలో 145 ఎస్ఏ పీఈటీ, 202 ఎస్జీటీ పోస్టులతో కలిపి మొత్తం 807 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి 2 ఎస్జీటీ పోస్టులతో కలిపి జిల్లాలో 4 పోస్టులు ఉన్నాయి.
News April 20, 2025
HYD: పీహెచ్డీ కోర్సు వర్క్ పరీక్ష తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ప్రీ పీహెచ్డీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్ సైట్‌లో చూసుకోవాలని సూచించారు.