News February 21, 2025

చీమకుర్తిలో క్షుద్ర పూజల కలకలం

image

చీమకుర్తి మండలంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఏలూరివారి పాలెం – కూనంనేనివారి పాలెం గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయాన్నే పనులకు వెళ్తున్న వారికి నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, పెద్ద ముగ్గు, మట్టి కుండలు దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 12, 2025

ప్రకాశం: బార్ల లైసెన్సులకు గడువు పొడిగింపు

image

ప్రకాశం జిల్లాలోని 4 ఓపెన్ కేటగిరి బార్ల లైసెన్సులకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 ఓపెన్ బార్ల లైసెన్స్‌ల కొరకు దరఖాస్తు గడువు గతంలో 14వ తేదీ వరకు నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ గడువు తేదీని 17 వరకు పొడిగించామన్నారు.

News September 12, 2025

ఉలవపాడు: బాలికపై సచివాలయం ఉద్యోగి అత్యాచారం

image

ఉలవపాడులో ఇటీవల ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన గురువారం వెలుగు చూసింది. SI అంకమ్మ వివరాల ప్రకారం.. ఇటీవల అనాధగా కనిపించిన బాలిక(13)ను పోలీసులు సంరక్షించి అనాధ ఆశ్రమంలో చేర్చారు. సింగరాయకొండలో సచివాలయ ఉద్యోగిగా చేస్తున్న రామకృష్ణ ఇంట్లో బాలిక పనిమనిషిగా చేసింది. ఈక్రమంలో బాలికను బెదిరించి రామకృష్ణ అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 12, 2025

ప్రకాశం: ప్లెక్సీ యజమానులకు, ప్రజలకు ఎస్పీ కీలక సూచన!

image

ఫ్లెక్సీల రూపంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు, అనుచిత పదజాలంపై కఠిన చర్యలు తీసుకుంటామని SP దామోదర్ అన్నారు. గురువారం SP కార్యాలయంలో మాట్లాడుతూ.. డిజైన్ చేసే వారికి, ప్రజలకు, ప్రింటింగ్ ప్రెస్ వారికి సూచనలు చేశారు. ఫ్లెక్సీ పోస్టర్స్, ప్లకార్డుల రూపంలో వివాదాస్పద వ్యాఖ్యల వల్ల వర్గాల మధ్య విద్వేషాలను రేకెత్తిస్తున్నాయని, ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని పేర్కొన్నారు.