News April 10, 2024
చీమకుర్తిలో 2.6 కేజీల గంజాయి పట్టివేత

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గ్రానైట్ కు నిలయమైన చీమకుర్తి పట్టణంలో గంజాయి భూతం జడలు విప్పుతోంది. ఇటీవల బడ్డీ బంకుల్లో సైతం గంజాయి చాక్లెట్లు అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. తాజాగా 2.6 కేజీల గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చీమకుర్తిలో ఎస్ఈబీ డీఎస్పీ గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశామని తెలిపారు.
Similar News
News April 22, 2025
ప్రకాశం: వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

ప్రకాశం జిల్లాలో వేర్వేరు ఘటనల్లో సోమవారం ముగ్గురు మృతి చెందారు. పామూరులో బాల భవేశ్ తండ్రి మందలించాడనే మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కాపురంలోని కాశీ రావు మానసిక స్థితి సరిగా లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు గ్రామానికి చెందిన అరవింద్ చెన్నైలో చదువుకుంటూ నీటిలో మునిగి మృతి చెందాడు.
News April 22, 2025
ఒంగోలు: పోలీస్ గ్రీవెన్స్‌కు 73 ఫిర్యాదులు

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు 73 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ ఏఆర్ దామోదర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను సావధానంగా విన్నారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను చట్ట పరిధిలో ఉండడంతో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News April 21, 2025
మార్కాపురం: ❤ PIC OF THE DAY

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ డ్రోన్ ఫొటో పలువురిని ఆకట్టుకుంది. శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. రథోత్సవంలో భాగంగా డ్రోన్ కెమెరా ఈ ఫొటోను క్లిక్ మనిపించింది. పట్టణంలోని వివిద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్న పట్టణ ఫొటోను స్థానికులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.