News February 21, 2025
చీరాలలో కొత్త తరహా మోసం

చీరాలలో గర్భిణిలకు, బిడ్డ తల్లులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.2లక్షలు వస్తాయని నమ్మబలికి, లింక్ పంపి మోసాలకు పాల్పడిన ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుషార్ డూడి శుక్రవారం తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఢిల్లీ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన జిల్లా పోలీసులను అభినందించారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ జరుగుతోందని ఎస్పీ తెలిపారు.
Similar News
News November 10, 2025
వర్షపు నీటిని ఒడిసి పడదాం: ఎంపీ పెమ్మసాని

వర్షపు నీటిని ఒడిసి పట్టి.. జీవనాధారం పెంచుదామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ పిలుపునిచ్చారు. వాటర్ షెడ్ మహోత్సవ్‌పై రెండ్రోజుల జాతీయ సదస్సు గుంటూరు వెల్కమ్ గ్రాండ్ హోటల్లో సోమవారం ప్రారంభమైంది. పెమ్మసాని మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తుందని, సీఎం చంద్రబాబు మంచి విజన్‌తో ఆ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు.
News November 10, 2025
నటుడు అభినయ్ మృతి

నటుడు అభినయ్(44) మరణించారు. కొన్నేళ్లుగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ చెన్నైలో కన్నుమూశారు. తన చివరి రోజుల్లో చికిత్సకు అవసరమైన డబ్బు కోసం ఆయన ఎదురుచూడాల్సి వచ్చిందని స్నేహితులు చెప్పారు. ధనుష్ తొలి సినిమా ‘థుల్లువాదో ఇళమై’తో అభినయ్ సినిమాల్లోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళ్, కన్నడలో సుమారు 15కు పైగా చిత్రాల్లో నటించారు. ఓరియో బిస్కెట్స్ సహా పలు యాడ్స్‌లోనూ కనిపించారు.
News November 10, 2025
గట్టు: పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యం-MLA బండ్ల

పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గట్టు మండలం ఆరగిద్దలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి 3 ఇళ్లు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో పేదలు సొంతిల్లు నిర్మించుకునే అవకాశం లభించిందన్నారు. మాజీ ఎంపీపీ విజయ్ పాల్గొన్నారు.


