News August 9, 2025
చీరాలలో గవర్నర్‌ను కలిసిన MLA కొండయ్య

చీరాలలో వాడరేవు ఐటీసీ గెస్ట్ హౌస్‌లో శనివారం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండ కలిశారు. గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరును ఎమ్మెల్యే కొండయ్య గవర్నర్‌కు వివరించారు.
Similar News
News August 10, 2025
చిన్నతనం నుంచే క్రీడలు అలవాటు చేసుకోవాలి: హరీశ్ రావు

చిన్నతనం నుంచే క్రీడలు అలవాటు చేసుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఇటీవల రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, సీనియర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో రాణించిన క్రీడాకారులను క్యాంపు కార్యాలయంలో శాలువా కప్పి అభినందించారు. క్రీడల్లో రాణించే వారికి పూర్తి సహకారం ఉంటుందన్నారు. విద్యార్థులు క్రీడలతో పాటు చదువుల్లో రాణించాలని సూచించారు.
News August 10, 2025
శ్రీకాకుళం: ‘12వ మహాసభలు జయప్రదం చేయాలి’

అక్టోబర్ 4,5 తేదీల్లో సోంపేటలోని జరిగే సీఐటీయూ శ్రీకాకుళం జిల్లా 12వ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అమ్మన్నాయుడు, తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఆ సంఘం కార్యాలయంలో వారు సమావేశం నిర్వహించారు. ధరల పెరుగుదల, అవసరాలు దృష్టిలో పెట్టుకొని కార్మికుల కనీస వేతనం నెలకు రూ. 26,000లగా నిర్ణయించి అమలు చేయాలన్నారు.
News August 10, 2025
సిద్దిపేట: ‘బాల సాహిత్యంపై పరిశోధన జరగాలి’

బాల సాహిత్యంపై పరిశోధన జరగాలని కవి ఉండ్రాళ్ళ రాజేశం, పెందోట వెంకటేశ్వర్లు, ఎడ్ల లక్ష్మి, కాల్వ రాజయ్య అన్నారు. ఆదివారం తెలంగాణ విశ్వవిద్యాలయంలో బాలగేయ సాహిత్యంపై పరిశోధన చేస్తున్న సిద్దిపేటకు చెందిన బాల సాహిత్య రచయిత సతీష్‌ను కలిసి మాట్లాడారు. బాల సాహిత్యానికి సిద్దిపేట జిల్లా తరపున సహకారం ఉంటుందన్నారు. బడి పిల్లల చేత రచనలు చేయిస్తూ వారిలో ఉన్న ప్రతిభను బయటకు తీపించడానికి రచయితల కృషి చేయాలన్నారు.