News April 13, 2024
చీరాల: ఇసుకలో మృతదేహం.. స్పందించిన నారా లోకేశ్

మండలంలోని ఈపూరుపాలెంలో ఇసుక లోడ్‌లో మృతదేహం బయటపడిన ఘటనపై ట్విటర్(X) వేదికగా శనివారం TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఇది ఇసుక మాఫియా పననే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ఈ ఘటన ఒక నిదర్శనమన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ భర్తలు తిరిగి వస్తారన్న నమ్మకం భార్యలకు లేకుండా పోయిందన్నారు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయని విమర్శించారు.
Similar News
News September 9, 2025
ప్రకాశంకు 3 రోజులు వర్షసూచన.. తస్మాత్ జాగ్రత్త!

ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA ప్రకటించింది. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అధిక ప్రభావం ఉంటుందని తెలిపింది. గత 3 రోజులుగా తీవ్ర వేడిమిలో బాధపడుతున్న ప్రజలకు ఇది చల్లని కబురు. అయితే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News September 9, 2025
ప్రకాశం: బాలింత మృతిపై విచారణకు కలెక్టర్ ఆదేశం!

మాతృ, శిశు మరణాలను నివారించడానికి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో MDR సమావేశం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలలో జిల్లాలో సంభవించిన మాతృ, శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ 3 నెలల కాలంలో ఒక బాలింత మృతి చెందింది. ఆమె మృతిపై విచారణ చేసి నివేదిక అందజేయాలన్నారు.
News September 9, 2025
వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడం అభినందనీయం: కలెక్టర్

ఒంగోలు నగర కార్పోరేషన్‌తో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐటీసీ సంస్థ సరికొత్త కాన్సెప్ట్‌తో చొరవ తీసుకుంది. స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్కాపురం, కనిగిరి మున్సిపాలిటీలు వ్యర్థాల నిర్వహణపై ఎంఓయూ పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వారు మంగళవారం ఒంగోలులో కలెక్టర్ తమీమ్ అన్సారియాను కలిశారు. ఇది అభినందనీయమని కలెక్టర్ తెలిపారు.