News February 17, 2025

చీరాల: టీడీపీలోకి భారీగా చేరికలు

image

చీరాల మండలం కావూరివారిపాలెం గ్రామానికి చెందిన 150 కుటుంబాలు టీడీపీలో చేరాయి. చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య పార్టీ కండువాలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.

Similar News

News January 1, 2026

పండుగలా పాస్‌ పుస్తకాల పంపిణీ చేపట్టాలి: జేసీ

image

జిల్లాలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీని పండుగ వాతావరణంలో చేపట్టాలని జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరంలో ఆర్డీవోలు, తహశీల్దార్లతో నిర్వహించిన గూగుల్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. జనవరి 2 నుంచి 9 వరకు ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని, రెవెన్యూ క్లినిక్‌ల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

News December 31, 2025

HYDపై పాలమూరు ఘన విజయం

image

HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ‘T-20 కాకా స్మారక క్రికెట్ లీగ్’లో పాలమూరు జట్టు ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 154/8 పరుగులు చేసింది. అనంతరం మహబూబ్ నగర్ జట్టు 17 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.MBNR జట్టుకు చెందిన క్రీడాకారులు అబ్దుల్ రపే-53* (4s-5,6s-1), డేవిడ్ కృపాల్ రాయ్-103* (4s-11,6s-6) పరుగులు చేశారు.ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, కోచ్‌లు అభినందించారు.

News December 31, 2025

2026లో టీమ్‌ఇండియా షెడ్యూల్ ఇదే

image

టీమ్‌ఇండియా 2026 జనవరిలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో 5 మ్యాచుల టీ20 సిరీస్‌, 3 మ్యాచుల ODI సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరి-మార్చిలో T20 వరల్డ్ కప్, జూన్‌లో AFGతో 3 వన్డేలు, 1 టెస్ట్, జులైలో ENGతో 5 T20s, 3 ODIs, AUGలో SLతో రెండు టెస్టులు, సెప్టెంబర్‌లో AFGతో 3 T20s, WIతో 3 వన్డేలు, 5 T20s, ఆక్టోబర్-నవంబర్‌లో NZతో 2 టెస్టులు, 3 వన్డేలు, డిసెంబర్‌లో శ్రీలంకతో 3 వన్డేలు, 3 T20లు ఆడనుంది.