News December 26, 2025
చీరాల: మద్యం మత్తులో ASI రచ్చ.. SP ఆగ్రహం

చీరాలలో మద్యం మత్తులో హల్చల్ సృష్టించిన వేటపాలెం ASI రవికుమార్‌పై తక్షణమే చర్యలు తీసుకుని వీఆర్‌కు పంపించినట్లు SP ఉమామహేశ్వర్ తెలిపారు. మద్యం మత్తులో పోలీసుల మధ్య జరిగిన ఘర్షణపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బంది క్రమశిక్షణకు మారుపేరని ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు. ఇటువంటి ఘటనలకు పాల్పడితే సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News December 28, 2025
2 రోజుల్లో ముగిసిన టెస్టు.. రూ.60 కోట్ల నష్టం?

యాషెస్ సిరీస్ క్రికెట్ ఆస్ట్రేలియాకు నష్టాలను తెచ్చిపెడుతోంది. మెల్‌బోర్న్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టు రెండు రోజుల్లో <<18683393>>ముగియడమే<<>> దీనికి కారణమని అంతర్జాతీయ మీడియా తెలిపింది. దీంతో భారీగా బిజినెస్ కోల్పోయి, దాదాపు రూ.60 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొంది. అంతకుముందు రెండో టెస్టు(పెర్త్) సైతం 2 రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. చివరి టెస్టు సిడ్నీ వేదికగా JAN 4న మొదలు కానుంది.
News December 28, 2025
నేటి ముఖ్యాంశాలు

✫ AP: టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి నాకంటే ముందున్నారు: చంద్రబాబు
✫ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ వదిలిపెట్టం: అనిత
✫ మానవ హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం: వైసీపీ
✫ TG: మహాత్ముడి పేరుతో వచ్చిన పథకాన్ని కాపాడుకోవాలి: రేవంత్
✫ ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి
✫ జనవరి 5 నుంచి MGRNEGA బచావో అభియాన్: కాంగ్రెస్
✫ యాషెస్: నాలుగో టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్
News December 28, 2025
కొత్తగా 784 మంది స్పెషాలిటీ వైద్యులు: సత్యకుమార్

AP: సెకండరీ/టీచింగ్ ఆస్పత్రులకు కొత్తగా 784 మంది PG వైద్యులు(సీనియర్ రెసిడెంట్స్) జనవరి 1 నుంచి రాబోతున్నారని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఇటీవల PG పూర్తి చేసిన వారికి పోస్టింగులు ఇస్తున్నట్లు చెప్పారు. నోటిఫికేషన్ జారీ చేశామని, ఈ నెల 29 వరకు ఆప్షన్ల నమోదు కొనసాగుతుందని చెప్పారు. వీరు 6 నెలలు బోధనాసుపత్రుల్లో, మరో 6 నెలలు సెకండరీ ఆసుపత్రుల్లో తప్పకుండా పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


