News July 24, 2024

చీరాల: రిటైర్డ్ ఉపాధ్యాయిని హత్య

image

చీరాల మండలంలోని ఈపూరుపాలెంలో వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న పి.లలిత (80) స్థానిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. పదేళ్ల క్రితం భర్త మృతి చెందాడు. ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఒంటరిగా ఉంటున్న లలితమ్మను గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకొన్న SP తుషార్ డూడీ విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 21, 2026

ప్రకాశం: మాల్ ప్రాక్టీస్‌కు చెక్.. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు

image

ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హర్షవర్ధన్ రాజు శనివారం తెలిపారు. 79 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, జిరాక్స్ కేంద్రాలు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ప్రశ్నపత్రాల రవాణా, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత, CC కెమెరాలు, డ్రోన్ నిఘా ఏర్పాటువంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

News February 21, 2026

చదివేది సింగరాయకొండ.. హాజరు కనిగిరి

image

సింగరాయకొండ చైతన్య పాఠశాలలో అనుమానస్పదంగా మృతి చెందిన తౌషిక్ విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తౌషిక్ మరణించిన తర్వాత శుక్రవారం రోజు కూడా కనిగిరిలో ప్రగతి విద్యా నిలయంలో పాఠశాలకు వచ్చినట్లు హాజర వేశారు. త్రిసభ్య కమిటీలో ఉన్న డీఈవో రేణుక ఇది గమనించి అవాక్కయ్యారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కౌశిక్ తల్లిదండ్రులు అంటున్నారు.

News February 21, 2026

APK ఫైల్స్‌, లింకులను ఓపెన్ చేయొద్దు: కనిగిరి DSP

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి DSP సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు. ఈ మధ్య కాలంలో SBI పేరుతో Aadhaar KYC Update”, “SBI Aadhaar Update.apk”వంటి ఫైళ్లు, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ద్వారా మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. APK ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ లేదా క్లిక్ చేయకూడదని స్పష్టం చేశారు.