News July 28, 2024

చుంచు ఎలుక కరచి వ్యక్తి మృతి.. నెల్లూరు జిల్లాలో ఘటన

image

నెల్లూరు రూరల్ మండలం ములుమూడిలో చుంచు ఎలుక కరచి మణికాల రాగయ్య (55) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. మంచంపై నిద్రిస్తుండగా ఎలుక కాలు, చేతిపై కరిచింది. కుటుంబసభ్యులు వెంటనే అతనిని స్థానిక సౌత్ మోపూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడ నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.

Similar News

News January 17, 2025

టౌన్ ప్లానింగ్‌లో నూతన సంస్కరణలు అమలు: మంత్రి 

image

దేశంలో ఎక్కడా లేనివిధంగా పట్టణాభివృద్ధి, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో నూతన సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గురువారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులుతో కలిసి సమీక్షించారు.

News January 16, 2025

రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది: కాకాణి

image

రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం పొదలకూరు మండల పరిధిలోని పులికల్లు, నేదురుమల్లి, వెలికంటి పాలెం, శాంతినగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన ఇష్టా గోష్టి నిర్వహించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటానని తెలిపారు.

News January 16, 2025

ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతం చేయండి: కలెక్టర్

image

ఈ నెల 18, 19, 20వ తేదీలలో సూళ్లూరుపేటలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ కోరారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. చాలా కాలం తరువాత ఈ పండుగను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని అన్నారు. గ్రామాలలో ప్రజలందరికి ఈ సమాచారం అందించాలన్నారు. పండుగకు వచ్చే సందర్శకులకు తాగునీరు, టాయిలెట్స్, వైద్య సౌకర్యం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.