News March 22, 2024
చెక్ పోస్టుల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు: జిల్లా

అనకాపల్లి జిల్లాలోని 9 చెక్ పోస్టుల వద్ద పోలీసులు, అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ రవి పట్టం శెట్టి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల ప్రక్రియపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణం నుంచి గ్రామాల వరకు ఎక్కడ ఉల్లంఘనలకు అవకాశం ఇవ్వకూడదన్నారు. నియమావళి అమలు, పరిశీలన పట్ల అధికారులు నిశితంగా గమనించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి పాల్గొన్నారు.
Similar News
News February 19, 2026
మారికవలసలో యువకుడి ఆత్మహత్య

మధురవాడలోని పి.ఎమ్.పాలెం పోలీస్ స్టేషన్ పరిధి మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కాలనీలో బ్లాక్ నంబర్ 88లో నివాసముంటున్న పీల శివ (19) బుధవారం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
News February 18, 2026
మిలాన్ ఏర్పాట్లపై సీపీ సమీక్ష

విశాఖలో రేపు జరగనున్న మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి స్వయంగా పర్యవేక్షించారు. బీచ్ రోడ్డులోని హోల్డింగ్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డ్రోన్లు, సీసీటీవీలు, సోషల్ మీడియా డెస్క్, భద్రతా వ్యవస్థల నిఘాను తనిఖీ చేసి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
News February 18, 2026
విశాఖలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటన ముగించుకుని తిరుగు ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా నేవల్ ఎయిర్ స్టేషన్ (INS డేగా) వద్ద గవర్నర్ S.అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్, సీపీలు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.


