News February 12, 2025

చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

కొమరాడ మండలంలో దేవుకోన గ్రామానికి చెందిన గిరిజనుడు కేలే నారాయణరావు(40) చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందినట్లు ఎస్సై నీలకంఠం తెలిపారు. మంగళవారం ఉదయం మేకల మేత తీయుట కొరకు ఇంటి వెనుక ఉన్న చెట్టు ఎక్కి ప్రమాద వశాత్తూ పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతిని బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు.

Similar News

News February 25, 2026

నరసాపురం: వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

image

నరసాపురం మండలం వేములదీవి పడమరలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. బుధవారం ఉదయం చేపల వేటకు వెళ్లిన బొమ్మిడి యేసుబాబు(53) అనే మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే నరసాపురం తహశీల్దార్ ఐవీవీ సత్య నారాయణ, ఆర్‌ఐ సురేఖ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News February 25, 2026

చెరకు పంటలో పీక, కాండం తొలుచు పురుగు ప్రభావం

image

చెరకు నాటిన దగ్గరి నుంచి నరికే వరకు ఈ పురుగులు పైరును ఆశిస్తాయి. బాల్య దశలో పీకపురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా పంటను నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధార చెరకుపై ఎక్కువగా ఉంటుంది. దీని ఉద్ధృతి ఎక్కువైతే పంటకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పురుగుల విషయంలో నిర్లక్ష్యం వద్దని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News February 25, 2026

పార్వతీ దేవి అన్నపూర్ణగా ఎలా మారింది?

image

లోకానికి ఆహారం అందించే దేవత అన్నపూర్ణ దేవి. ఓసారి శివుడు ‘ఆహారం ఓ భ్రమ’ అన్నాడు. దీంతో కోపగించిన పార్వతీదేవి కాశీకి వెళ్లింది. దీంతో సకల జీవరాశులు ఆకలితో అలమటించాయి. అప్పుడు ఆహారం ప్రాముఖ్యం అర్థమైన శివుడు కాశీకి వెళ్లి అమ్మవారిని భిక్ష అడుగుతాడు. పరమేశ్వరుడికే అన్నం పెట్టడంతో ఆ తల్లి ‘అన్నపూర్ణ’గా ప్రసిద్ధి చెందింది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం వల్ల ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.