News March 15, 2025

చెత్తతో పేరుకుపోయిన భద్రాచలం బస్టాండ్..!

image

నిత్యం వేలాదిమంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రాంతం భద్రాచలం బస్టాండు. భద్రాద్రి రాముడి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది ఈ బస్టాండ్ ద్వారా ప్రయాణాలు సాగిస్తారు. అలాంటి రద్దీ గల బస్టాండ్ ప్రాంగణంలో చెత్త పేరుకుపోయి దుర్వాసనను వెదజల్లుతోంది. సరైన సౌకర్యాలు లేక ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం గల బస్టాండును పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.

Similar News

News March 16, 2025

HYD: డ్రంక్ అండ్ డ్రైవ్.. 315 మంది చిక్కారు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 315 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 233 ద్విచక్ర వాహనాలు, 5 త్రిచక్ర వాహనాలు, 71 నాలుగు చక్రాల వాహనాలు, 6 హెవీ వెహికిల్ వాహనాలు పట్టుబడ్డాయన్నారు. పట్టుబడ్డ వారందరినీ కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్నారు.

News March 16, 2025

బాపట్ల: పొట్టి శ్రీరాములకు ఘన నివాళి

image

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

News March 16, 2025

ట్యాంక్ బండ్‌పై ఆంధ్రుల విగ్రహాలు తొలగించే దమ్ముందా: బండి

image

TG: పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చాల్సిన అవసరం ఏంటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఆయన గొప్ప దేశభక్తుడని, ఏపీ మూలాలుంటే పేర్లను మార్చేస్తారా అని నిలదీశారు. NTR, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లను కూడా మారుస్తారా అని అన్నారు. ట్యాంక్ బండ్‌పై ఆంధ్రుల విగ్రహాలు తొలగించే దమ్ముందా అని ప్రశ్నించారు. తక్షణమే చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు.

error: Content is protected !!