News May 23, 2024
చెన్నరావుపేట: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నారావుపేట మండలం మగ్దుంపురంలో చోటుచేసుకుంది. మగ్దుంపురం గ్రామానికి చెందిన తోట రాజు(40)కు కొన్నేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. భార్య భర్తల మధ్య గొడవతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య కాపురానికి రాకపోవడం, మద్యానికి బానిసైన రాజు రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.
Similar News
News March 14, 2025
రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు.
News March 14, 2025
వరంగల్: నగర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మేయర్

హోలీ పండుగ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రత్యేకంగా నిలిచే ఈ హోలీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల పండుగను ఆనందంతో సంతోషంగా జరుపుకోవాలని మేయర్ ఆకాంక్షించారు.
News March 14, 2025
వరంగల్: హోలీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

హోలీ పండుగను పురస్కరించుకొని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద జిల్లా ప్రజలకు హోలీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందర్నీ ఒకటి చేసే ఈ హోలీ పండుగ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషంతో వెలుగులో నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనంద ఉత్సాహాలతో హోలీ వేడుకలు జరుపుకోవాలని అన్నారు. సహజ రంగులను వినియోగిస్తూ సాంప్రదాయబద్ధంగా పోలి నిర్మించుకోవాలని కలెక్టర్ కోరారు.