News March 20, 2025
చెన్నారావుపేట: రెండు రోజుల్లో టెన్త్ పరీక్షలు.. విద్యార్థి మృతి

మరో రెండు రోజుల్లో వార్షిక పరీక్షలకు వెళ్లాల్సిన పదో తరగతి విద్యార్ధి గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లిలో చోటుచేసుకుంది. పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేటలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అశ్వంత్ బుధవారం మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Similar News
News March 20, 2025
పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు అలర్ట్

పార్వతీపురం జిల్లాలో బుధవారం అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని (APSDMA) హెచ్చరించింది. బలిజిపేటలో 40.8°C, భామిని 39.7, గరుగుబిల్లి 40.7, గుమ్మలక్ష్మీపురం 39.3, జియ్మమ్మవలస 40.1, కొమరాడ 39.5, మక్కువ 39.6, పాచిపెంట 38.0, పాలకొండ 39.7, పార్వతీపురం 40.4, సాలూరు 38.6, సీతంపేట 39.2, సీతానగరం 40.8, వీరఘట్టంలో 40.3°Cగా నమోదవుతాయి.
News March 20, 2025
BUDGET.. లెండి ప్రాజెక్టుకు రూ.42 కోట్లు

కామారెడ్డి జిల్లాకు రాష్ట్ర బడ్జెట్‌లో నామమాత్రంగానే నిధులు కేటాయించారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలకు సాగునీటిని అందించే కాళేశ్వరం 22వ ప్యాకేజీకి నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. కోనేళ్లుగా దీనికి సంబంధించిన పనులు ముందుకు సాగడం లేదు. కాగా అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయినా లెండి ప్రాజెక్టుకు రూ. 42 కోట్లు, కౌలాస్, పోచారం ప్రాజెక్టులకు రూ. 10 కోట్లు, నల్లవాగుకు రూ. 5 కోట్లు కేటాయించారు.
News March 20, 2025
యూనివర్సిటీకి బడ్జెట్‌లో నిధులు ఎంతంటే.?

వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి రూ.50కోట్లు, జీతభత్యాలకు రూ.145.62కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్‌లో జీతభత్యాలకు రూ.135కోట్లు, రూ.500కోట్లు ప్రతిపాదించగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ బడ్జెట్‌లో ప్రవేశ పెట్టిన నిధులను యూనివర్సిటీకి ఖర్చు చేస్తారో, లేదో.. వేచి చూడాలి.