News August 29, 2025

చెన్నూరు: ‘మెరుగైన సేవలను అందించాలి’

image

చెన్నూరు మండలంలోని సబ్ స్టేషన్లను మంచిర్యాల డివిజన్ SE ఉత్తమ్ పరిశీలించారు. కొమ్మెర, రచ్చపల్లి, ఆస్నాద్ సబ్‌స్టేషన్‌లలో ఉన్న రికార్డులను ఆయన పరిశీలించారు. LC తీసుకునే సమయంలో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆపరేటర్ సేఫ్టీ కిట్లను ఉపయోగించుకోవాలని సూచించారు. సబ్‌స్టేషన్ మెయింటెనెన్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.

Similar News

News August 30, 2025

నారాయణపేట: జిల్లా సర్వే నివేదిక కమిటీ ఏర్పాటు

image

జిల్లా సర్వే నివేదిక కమిటీని ఏర్పాటు చేసేందుకు శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని నిర్ణీత గడువులోపు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. ఆ సమాచారాన్ని క్రోడీకరించి జిల్లా సర్వే నివేదికను రాష్ట్ర కాలుష్య మండలికి అందజేయాలని చెప్పారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

News August 30, 2025

దామరగిద్ద: దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తికి శిక్ష

image

నారాయణపేట బస్టాండ్‌లో దొంగతనాలు చేసిన దామరగిద్ద మండలం మద్దెలబీడు వాసి హనుమంతుకు JFCM జడ్జి సాయి మనోజ్ ఏడు నెలల 8 రోజుల శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారని సీఐ శివశంకర్ తెలిపారు. గత సంవత్సరం మార్చి, జూన్ నెలల్లో నారాయణపేట వాసి లక్ష్మి బస్ ఎక్కుతుండగా హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న 6 వేలు, 6 గ్రాముల బంగారం, మాగనూరు మండలం నేరడగం వాసి కవిత బ్యాగ్‌లో ఉన్న రూ.30 వేలు, తులం బంగారం చోరీ చేశాడన్నారు.

News August 30, 2025

డిసెంబర్‌లో ఇండియాకు పుతిన్!

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది డిసెంబర్‌లో భారత పర్యటనకు రానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. గత మేలో ప్రధాని మోదీ పుతిన్‌ను ఇండియాకు రావాలని ఆహ్వానించారు. కాగా సెప్టెంబర్ 1న చైనాలో జరిగే ప్రాంతీయ సమావేశంలో మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ఒకే వేదికపై కలవనున్నారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు, అమెరికా టారిఫ్స్ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.